/rtv/media/media_files/2026/03/23/trump-2026-03-23-17-53-22.jpg)
Trump
Trump : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మంతా ఇంధన సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలకు ఊరటనిచ్చేవి కావడం గమనార్హం. ఆయన మాట్లాడుతూ ఇరాన్(iran us war news today) తో యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని హింట్ ఇచ్చాడు. అయితే ఇటీవల తను మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన తన వ్యాఖ్యలను వక్రీకరించారని ట్రంప్ ఆరోపించడం గమనార్హం. నవంబర్ నాటికి చమురు ధరలు పెరుగుతాయని తాను చెప్పినట్లు నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధరలు పెరుగుతాయని తాను చెప్పలేదన్నారు. ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్న ఆయన నవంబర్‌లో ఎన్నికలు వచ్చే సమయానికి చమురు ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read : చైనా అంగీకరించింది.. చాలా హ్యాపీ: ట్రంప్ ఆసక్తికర పోస్ట్
Trump Says Oil Prices Will Fall Drastically
మరోవైపు చైనా హ్యాపీగా ఉందంటూ ట్రంప్ ట్రూత్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. అందులో ఆయన పోస్టు చేస్తూ త్వరలో హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరవనున్నట్లు పేర్కొనడం విశేషం. దీని వల్ల చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వరాదని తాను కోరాగానే ఆయుధాలు ఇవ్వకుండా ఉండేందుకు బీజింగ్ అంగీకరించిందన్నారు. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్, తాము కలిసి పనిచేస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. కొద్ది రోజుల్లోనే ఆయన్ను కలుస్తానని కూడా వెల్లడించారు. అదే సమయంలో యుద్ధం చేయడంలో అమెరికాను మించిన దేశం మరొకటి లేదనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.
Also Read : అప్పుల్లో పాకిస్తాన్.. సౌదీ భారీ ఆర్థిక సాయం!
Follow Us