/rtv/media/media_files/2025/03/30/cKc9wtM4dnz4eJ2ZN6UN.jpg)
Myanmar Earthquake
భారీ భూకంపంతో మయన్మార్ , థాయ్‌లాండ్ లు వణికిపోతున్నాయి.ఈ ప్రకృతి విపత్తు కారణంగా మయన్మార్ మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అదేవిధంగా శిథిలాల కింద చిక్కుకుపోయిన వేలాది మందిని రక్షించేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని సిబ్బంది రక్షించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మయన్మార్,టర్కిష్‌కు చెందిన సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలోనే రాజధాని నేపిడాలోని ఓ భవనం శిథిలాల కింద 26 ఏళ్ల వ్యక్తిని గుర్తించారు. వెంటనే అతడిని రక్షించి ,ఆస్పత్రికి తరలించారు. ఇటీవల రెస్క్యూ సిబ్బంది మాండలేలోని గ్రేట్ వాల్ హోటల్ శిథిలాల నుంచి ఒక గర్భిణీని సజీవంగా బయటకు తీశారు.
Also Read: Pastor Praveen : లారీ కింద పడి.. పాస్టర్ ప్రవీణ్ కేసులో షాకింగ్ సీసీ ఫుటేజ్!
ఇక ఈ భూకంపం కారణంగా మధ్య, వాయువ్య మయన్మార్ లో మొత్తం10 వేల భవనాలు కులిపోవడం లేదా పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది.ప్రకృతి విపత్తు కారణంగా ఇక్కడ ఇప్పటి వరకు 2,179 మంది మృతి చెందగా..4,521మంది గాయపడ్డారు. ఇంకా 441మంది ఆచూకీ తెలియ రావాల్సి ఉంది.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.విపత్కర సమయంలో పొరుగుదేశానికి అండగా నిలిచేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట భారత్ పెద్ద ఎత్తున సహాయక సామాగ్రిని చేరవేస్తోంది.
80 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యల్లో పాల్గొంటోంది.భారత్ తో పాటు వివిధ దేశాలు కూడా మయన్మార్ కు సాయాన్ని అందిస్తామని ప్రకటించాయి.ఇక థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఇప్పటి వరకు 13 మృతదేహాలు బయటపడ్డాయి.
భూకంపం కారణంగా నిర్మాణంలో ఉన్న30 అంతస్తుల భవనం కూలిపోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో శిథిలాల కింద 300 మంది కార్మికులు చిక్కుకుని ఉంటారని ,వారిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చినవారేనని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Also Read:AP BREAKING: విజయనగరంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్‌ప్రెస్..!
Also Read: Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్ తరహా మిస్టరీ వైరస్...!
myanmar earthquake | myanmar earthquake today | massive earthquake in myanmar | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates