France: 299 మంది రోగుల పై అత్యాచారం..!

ఫ్రాన్స్‌ లో 30 సంవత్సరాల పాటు తన వద్దకు వచ్చే రోగుల పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ సర్జన్‌. సుమారు 299 మంది పైఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన వద్దకు వచ్చిన రోగులు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు.

New Update
crime

crime Photograph: (crime)

వైద్యో నారాయణో హరి అన్నారు. కనిపించే దేవుడు వైద్యుడు అన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓ డాక్టర్‌ పవిత్రమైన వృత్తిలో ఉన్న అన్న విషయం మరిచి పోయి అత్యంత దారుణంగా రోగుల పై ఆకృత్యాలకు ఒడిగట్టాడు. అలా మూడు దశాబ్దాల పాటు తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడో నికృష్టుడు.

Also Read:TG Crime: పోలీస్‌తో అక్రమ సంబంధం.. పసి పిల్లలకు పురుగుల మందు తాగించి చంపిన తల్లి!

వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావడం మరింత విచారకరం. ఈ దారుణ విషయం ఫ్రాన్స్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో నిందితుడైన 74 సంవత్సరాల జోయెల్‌ లి స్కౌర్నెక్‌ పై ప్రస్తుతం విచారణ జరుగుతుంది.

Also Read: Shikhar Dhawan: బీసీసీఐ నిర్ణయాలపై ధావన్ సంచలన వ్యాఖ్యలు.. అది తప్పనిసరి అంటూ!

ఫ్రాన్స్‌ లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయెల్‌ ఓ ఆసుపత్రిలో సర్జన్‌ గా పని చేసేవాడు. 30 సంవత్సరాల తన వద్దకు వచ్చే రోగుల పై అతడు ఈ దారుణాలకు పాల్పడినట్లు తెలుస్తుంది. వారు మత్తులో ఉండగా లైంగిక దాడి చేసేవాడు. అయితే అతడి ఆకృత్యాలు బయపడింది మాత్రం 2017 లో తన పొరుగింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడంతో జోయెల్‌ పై కేసు నమోదైంది.

650 లకు పైగా..

ఈ కేసు దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా ఆశ్లీల ఫొటోలు బయటపడ్డాయి. 650 లకు పైగా అశ్లీల వీడియోలను గుర్తించారు. నిందితుడి మానసిక ప్రవర్తన చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు.

చిన్నారులు,జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శంగార కార్యకలాపాలు నెరుపుతున్నట్లు అతడి డైరీల్లో చూసి అధికారులు షాకయ్యారు.ఎవరెవరి పై లైంగిక దాడి జరిపిన విషయాలను ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకున్నట్లు గుర్తించారు.ఈఘటన తరువాత మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలడంతో 2020 లో కోర్టు జోయెల్‌ ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష ను ఖరారు చేసింది..

ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా..అతడిపాపాల చిట్టా బయటపడింది.అయితే బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియకపోవడం గమనార్హం.జోయెల్‌ డైరీలో తమ పేర్లను చూసే తాము ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మురం చేయగా...తాజాగాఅతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిల పై అతడు అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు.

వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు.నేను చాలా క్రూరమైన పనులు చేశా. ఆ పిల్లల మనసుకు అయిన ఈ దారుణ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలానే ప్రవర్తించాను. నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నా అని జోయెల్‌ తెలిపాడు.ప్రస్తుతం దీని పై విచారణ కొనసాగుతోంది. ఒకవేళ అతడిని దోషిగా తేలిస్తే మరో 20ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Trump: ఆయనేమి నియంత కాదు అంటున్న ట్రంప్‌!

Also Read: Trump: మస్క్‌ కు రిప్లై ఇవ్వకపోతే ఉద్యోగుల పై వేటు తప్పదు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు