/rtv/media/media_files/2025/01/17/HwY8ypdFmdxeehVbIF4O.jpg)
obama and michelle
Barack Obama Birthday: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘హ్యాపీ బర్త్ డే టూ ది లవ్ ఆఫ్ మై లైఫ్’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నీతో కలిసిని నేను నడవగలిగాను, అందుకు నేను చాల అదృష్టవంతున్ని అని ఆయన ట్వీట్‌లో పేర్కొంటూ వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఎక్స్ వేదికగా ఒబామా ఆయన భర్తపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.
Happy birthday to the love of my life, @MichelleObama. You fill every room with warmth, wisdom, humor, and grace – and you look good doing it. I’m so lucky to be able to take on life's adventures with you. Love you! pic.twitter.com/WTrvxlNVa4
— Barack Obama (@BarackObama) January 17, 2025
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
హ్యాపీ బర్త్ డే మై లవ్..
ఇటీవల వీరు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. జనవరి 17న మిషెల్ ఒబామా పుట్టిన రోజు. భారతీయ కాలమానం ప్రకారం బరాక్ ఒబామా శుక్రవారం రాత్రి 11 గంటలకు భర్యకు బర్త్ డే విషెస్ చేప్పారు. విడాకుల విషయంలో స్వయంగా మిషెల్ టీం ఆమె పుట్టిన రోజునాడే క్లారిటీ ఇచ్చింది.
Also Read: ఒబామా దంపతుల విడాకులు ?.. క్లారిటీ ఇచ్చిన మిషెల్ టీమ్
ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఒబామా హజరవుతారని మిషెల్ ఒబామా టీం తెలిపింది. గతంలో ట్రంప్ ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసిన విమర్శల వల్లే మిషెల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని తెలిపింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలను మిషెల్ సీరియస్‌గా తీసుకున్నారని.. ఆయన్ని ఆమె ఎప్పటికీ క్షమించనని చెప్పినట్లు పేర్కొంది.
Also Read: ట్రంప్ ప్రమాణస్వీకారానికి అంబానీ దంపతులు
కొన్నిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జరిగినప్పుడు ఆమె వేరే చోట ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయారని తెలిపింది. గత కొంతకాలంగా ఒబమా, మిషల్ దంపతులు వివిధ కార్యక్రమాలకు విడివిడిగా హాజరవుతున్నారు. దీంతో వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ఊహగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మిషెల్ టీమ్ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!