UK: లండన్ ఎయిర్ పోర్ట్ లో అగ్ని ప్రమాదం..

లండన్ లో హీథ్రూ ఎయిర్ పోర్ట్ దగ్గరలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ లో మంటలు చెలరేగాయి. దీని కారణంగా అక్కడ విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో రేపటివరకు ఎయిర్ పోర్ట్ ను మూసివేస్తున్నారు. 

author-image
By Manogna alamuru
New Update
london

London Air Port

లండన్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి అతి పెద్ద ఎయిర్ పోర్ట్ అయిన హీథ్రూ ఎయిర్ పోర్ట్ లో సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి.  దీనివలన అక్కడంతా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటల కారణంగా ఎయిర్ పోర్ట్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అత్యంత రద్దీగా ఉండే హిథ్రూ ఎయిర్ పోర్ట్ ను మూసేస్తున్నామని  అధికారులు ప్రకటించారు. విమానాల రాకపోకలన్నీ ఆగిపోయాయి. 24గంటల వరకు ప్రయాణికులు ఎవరూ విమానాశ్రయానికి రావద్దని.. మరిన్ని వివరాల కోసం విమానయాన సంస్థను ఆశ్రయించాలని అధికారులు కోరారు. పలు విమానాలు  దారి మళ్లించారు. ఈరోజంతా విమానాశ్రయాన్ని క్లోజ్ చేస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.  విమానాల రద్దు కారణంగా ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా..

సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం వలన ఎయిర్ పోర్ట్ లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మంటలు భారీగా ఎగసిపడడం వల్ల చుట్టుపక్కల నివాసాల్లో ఉన్న 150 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. మంటలను ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. పది అగ్ని మాపక యంత్రాలు, 70 మంది సిబ్బంది ఇదే పనిలో ఉన్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 

Also Read:  USA: ఆ భారత విద్యార్థిని పంపించొద్దు..అమెరికా న్యాయస్థానం

Advertisment
Advertisment
Advertisment