/rtv/media/media_files/2026/04/14/us-vs-iran-2026-04-14-09-28-37.jpg)
F-35B Lightning II Jets, MV-22 Ospreys, 15 Warships Trump's Hormuz Arsenal
పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలపై దిగ్బంధనాన్ని మొదలుపెట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా 15కు పైగా అడ్వాన్స్‌డ్ యుద్ధనౌకలను మోహరించింది. ముఖ్యంగా అరేబియా సముద్రంలో మోహరించిన 'యూఎస్ఎస్ ట్రిపోలి' (LHA 7) యుద్ధనౌక నుంచి F-35B లైట్నింగ్ II స్టీల్త్ ఫైటర్లు, MV-22 ఆస్ప్రే విమానాలు నిరంతరం నిఘా ఉంచనున్నాయి. ఈ విషయాన్ని యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. కానీ ఇరానేతర ఓడరేవులకు వెళ్లే నౌకలకు మాత్రం హర్మూజ్‌లో ఎలాంటి అంతరాయం కలిగించమని తేల్చిచెప్పింది.
USS Tripoli (LHA 7) conducts night flight operations while sailing in the Arabian Sea. Tripoli is designed without a traditional well deck, which allows for more F-35B Lightning II stealth fighters, MV-22 Ospreys, helicopters, and extra maintenance space. During peak operations,… pic.twitter.com/zjQO1nOcmK
— U.S. Central Command (@CENTCOM) April 13, 2026
మరోవైపు హర్మూజ్ దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ఇరాన్‌ను మరోసారి హెచ్చరించారు. ఇరాన్ నావీకి చెందిన 158 యుద్ధ నౌకలు సముద్రగర్భంలో కలిసిపోయినట్లు పేర్కొన్నారు. ఇక మిగిలిన ఫాస్ట్ అటాక్ బోట్లు తమ దిగ్బంధనం పరిధిలోకి సమీపిస్తే వాటిని కూడా నాశనం చేస్తామంటూ హెచ్చరించారు. సముద్ర మార్గంలో డ్రగ్స్ స్మగ్లర్లను ఎలా కట్టడి చేశామో.. ఇరాన్ బోట్ల విషయంలో కూడా అదే రూల్‌ను పాటిస్తామని తేల్చిచెప్పారు.
Also Read: హర్మూజ్ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఆటంకం ఉండదు.. ఇరాన్ కీలక హామీ
ఇదిలాఉండగా ఇస్లామాబాద్‌లో ఇరాన్-అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కూడిన బృందం చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేకపోయింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య రెండు వారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో చర్చలు విఫలమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ట్రంప్ హర్మూజ్ జలసంధిపై ట్రంప్ దిగ్బంధనాన్ని ప్రకటించారు. . భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 7.30 గంటల నుంచి ఈ దిగ్బంధనం అమల్లోకి వచ్చింది. ఇరాన్ పోర్టుల వైపు రాకపోకలు సాగించే నౌకలను అమెరికా నావీ అడ్డుకుంటోంది.
ఇదిలాఉండగా ఫిబ్రవరి 28న యుద్ధ ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ కొన్ని కోట్ల బ్యారళ్ల చమురును వేరే దేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో ఎక్కువభాగం తమపై ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాల కంట కనబడకుండా తరలించింది. అయితే ప్రస్తుతం అమెరికా దిగ్బంధనం వల్ల ఇరాన్ ఎగుమతులు నిలిచిపోనున్నాయి. దీనివల్ల ఆ దేశానికి ఆర్థికంగా మరింత భారీ నష్టం జరగనుంది. ఇలా చేస్తే తమతో వాళ్లు శాంతి ఒప్పందానికి వస్తారని ట్రంప్ భావిస్తున్నారు.
Also Read: ఇండియాకు బిగ్ షాక్.. హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 15 భారతీయ నౌకలు
ఈ దిగ్బంధనం వల్ల అంతర్జాతీయంగా కూడా చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో ట్రంప్‌పై ఒత్తిడి పడొచ్చు. సోమవారం చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 7 శాతం పెరిగింది. ఒకవేళ ఇరాన్ దాడులు చేస్తే ఈ దిగ్బంధనాన్ని అమెరికా బలగాలు కొనసాగించడం కష్టం అవుతుంది.
Follow Us