/rtv/media/media_files/2025/01/13/yHKurSSDCcUt1kLIXCYv.jpg)
us california Photograph: (us california)
US California: లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు(Wildfires) దొంగలు, మోసగాళ్లకు ఓ వరంలా మారింది. ఏకంగా ఓ ఇంటినుంచి ఎమ్మీ అవార్డును కూడా దోచుకున్నట్లు అధికారులు ప్రకటించారు.మాండెవిల్లే కెనైన్ అనే ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు దాదాపు 2 లక్షల డాలర్ల విలువైన వస్తువులు దోచుకున్నట్లు గుర్తించారు. ఏటోన్ లో కార్చిచ్చు వ్యాపించిన ప్రదేశంలో ఎమ్మీ అవార్డు చోరీ జరిగింది. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ అటార్నీ నాథన్ హోచ్‌మన్ వెల్లడించారు.
Also Read: Stock Market: పండగ పూట మంచి ఊపులో స్టాక్ మార్కెట్
ఇక పసిఫిక్ పాలిసేడ్స్ లో వ్యాపించిన మంటలు 23,713 ఎకరాలను కాల్చేయగా..ఏటోన్ లో వ్యాపించిన మంటలు 14,117 ఎకరాలను బూడిద చేశాయి. రెండు చోట్లా కలిపి దాదాపు 19 వేల నిర్మాణాలు బూడిదగా మారాయి. మొత్తం 63 చదరపు మైళ్లు అగ్నికి ఆహుతైంది. ఈ వైశాల్యం బార్బోస్ దేశం కంటే ఎక్కువ.
Also Read: Oscar: మరోసారి వాయిదా పడ్డ ఆస్కార్ నామినేషన్ల ప్రక్రియ!
సహాయక చర్యల్లో 800 మంది ఖైదీలు కూడా పాలు పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. స్టేట్ కన్జర్వేషన్ క్యాంప్ ప్రోగ్రామ్ లో సంతకం చేసిన ఖైదీని పంపినట్లు కాలిఫోర్నియా(California) డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ అండ్ రిహాబిలిటేషన్ వెల్లడించింది.మరో వైపు వందల మంది నేషనల్ గార్డ్స్ ఇప్పటికే ఇక్కడి అగ్ని కీలలతో పోరాడుతున్నారు.
కాలిఫోర్నియా, నెవడా,వ్యోమింగ్ వంటి ప్రాంతాల నుంచి మరో 1850 మందిని తరలిస్తున్నారు. క్యాంప్ పెండ్లేటొన్ నుంచి 500 మెరైన్స్ బయల్దేరి వెళ్లారు. 10 ఛాపర్లను కూడా అదనంగా అక్కడికి తరలించినట్లు పెంటగాన్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ సబ్రినా సింగ్ వెల్లడించారు.పాలిసేడ్స్ ,ఏటోన్ ప్రాంతాల్లో వేల మంది నిరాశ్రయులుగా మారి సాయం కోసం ఆర్థిస్తున్నారు. దీనిని కొందరు మోసగాళ్లు అదునుగా చేసుకుని నిధుల సేకరణ పేరిట స్కామ్‌లకు పాల్పడుతున్నారు.
Also Read:Mahakumbh 2025: తొలిరోజే కోటిన్నర మంది పుణ్య స్నానాలు!
ప్రముఖ నటి కిమ్ కర్దాషియా పేరిటే ఒకరు ఫండ్ రైజింగ్ మొదలు పెట్టారు. ఈ విషయం ఆమె గుర్తించి తన అభిమానులను హెచ్చరించారు. మోసగాళ్లు ముఖ్యంగా వృద్ధులు, వలస వచ్చిన వారు, ఇంగ్లీష్ మాట్లాడలేని వారిని లక్ష్యంగా చేసుకొంటున్నట్లు కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా పేర్కొన్నారు.
చుక్కలనంటుతున్న అద్దెలు(US California Wildfires)
కార్చిచ్చు కారణంగా దాదాపు 19 వేల నిర్మాణాలు కాలి బూడిద కావడంతో లాస్ ఏంజెలెస్ లో అద్దెల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.వేలమంది నిరాశ్రయులు కావడంతో ..ఇళ్ల యజమానులు అద్దెలను పెంచినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. అసలు 10 శాతం కంటే అద్దెలు పెంచకూడదనే కాలిఫోర్నియా చట్టాన్ని చాలా మంది ఉల్లంఘిస్తూ..విపరీతంగా రెంట్లను పెంచేస్తున్నారు.
Also Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు