/rtv/media/media_files/2025/02/16/WR7OrlVTZvgGsAnBlQVr.jpg)
elon Musk Father comments On Obama and michelle
బరాక్ ఒబామా దంపతుల గురించి ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ వింత వాదనలు చేస్తున్నారు. ఒబామా గే అని...అతని భార్య మిషెల్ ఒబామా కూడా పురుషుడే అని ఎర్రోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషెల్ ఆడవేషం వేసుకున్న మగ వ్యక్తి అని చెప్పుకొచ్చారు. బరాక్ ఒబామా పెళ్లాడింది మహిళను కాదు.. పురుషుడినని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక 'క్వీర్' అని.. ఆయన పెళ్లి చేసుకుంది స్త్రీలా దుస్తులు ధరించిన ఒక వ్యక్తిని.. అని ఎర్రోల్ మస్క్ 'వైడ్ అవేక్ పాడ్‌కాస్ట్'లో చెప్పారు.
కావాలంటే ఇంటర్నెట్ లో చూసుకోండి...
ఎర్రోల్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు అక్కడ ఉన్న వ్యాఖ్యాత కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి మీరు చెప్పేది నిజమా అని హోస్ట్ జాషువా రూబిన్ అడగ్గా..మీకు తెలీదా...కావాలంటే వెళ్ళి ఇంటర్నెట్ లో చూసుకోండి అని కూడా వింతడ వాదం చేశారు. పైగా తన మాటలను సమర్ధించుకోవడానికి 2014లో వైరల్ అయిన ఒక కుట్ర సిద్ధాంతాన్ని ఉదహరించాడు. హాస్యనటుడు జాన్ రివర్స్ మాజీ ప్రథమ మహిళ పురుషాంగం గురించి జోక్ చేసినప్పుడు. బరాక్ ఒబామా 'గే' అని కూడా ఆయన ఆరోపించారని చెప్పుకొచ్చారు. అయితే ఎర్రోల్ చెప్పిన దానికి ఎటువంటి ఆదారాలు లేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారమే రేపుతున్నాయి. బరాక్, మిషెల్ విడాకుల వదంతులు చలరేగుతున్న సమయంలో ఎర్రోల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
‘Michelle Obama is a MAN’: Elon Musk’s father Errol says ‘Big Mike’ is REAL
— RT (@RT_com) February 14, 2025
Former President Barack Obama ‘is a queer who's married to a man who dresses as a woman’ pic.twitter.com/fCvLDU5gwk
బరాక్ ఒబామా అమెరికాకు వరుసగా రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ పార్టీ తరుఫు నుంచి ఈయన ప్రెసిడెంట్ గా గెలిచారు. 1992లో ఒబామా, మిషెల్ కు పెళ్ళయింది. అంతకు ముందు 1989లో ఒక న్యాయ సంస్థలో వీరిద్దరూ కలుసుకున్నారు. తర్వాత ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళిచేసుకున్నారు. వీరికి మాలియా (26), సాషా (23) అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
Also Read: Pakistan: పాకిస్తాన్ లో భూకంపం..భారత్ సరిహద్దుల్లో కూడా..