/rtv/media/media_files/2025/03/01/A6q3GpDd3ZEVaohJetUv.jpg)
Donald Trump and Zelenskyy’s clash video Viral
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య ఖనిజ సంపద ఒప్పందం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. జెలెన్‌స్కీ అనుసరిస్తున్న వైఖరిపై ట్రంప్‌తో పాటు ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికీ జెలెన్ స్కీ.. ఒప్పందంపై సంతకం చేయకుండానే వెనుదిరిగారు. అమెరికాలో తన తదుపరి కార్యక్రమాలను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు.
Also Read: అతడు మూడో ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నాడు.. ట్రంప్ సంచలనం!
ఓవైపు ట్రంప్‌కు క్షమాపణలు చెప్పేదే లేదని జెలెన్‌స్కీ.. మరోవైపు ఉక్రెయిన్‌కు వైట్‌హౌజ్ తలుపులు మూసుకుపోయాయని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇలా ఇరు దేశాధినేతలకు వైరం కొనసాగుతున్న వేళ.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ట్రంప్, జెలెన్‌స్కీ, జేడీ వాన్స్ ఒకరిపై ఒకరు పోట్లాడుకునేలా ఈ వీడియోను ఎడిట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
LMAO! Who created this video?😂 pic.twitter.com/Gr8Pnl2Nz6
— War Intel (@warintel4u) February 28, 2025
అమెరికా, ఉక్రెయిన్ మధ్య వివాదాలు కొనసాగుతున్న వేళ.. నాటో దేశాలు ఉక్రెయిన్‌కే మద్దతు తెలుపుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. ఉక్రేనియన్లను బాధితులుగా వర్ణించారు. మొదట నుంచి పోరాడుతున్న వారిని గౌరవించాలి అంటూ కామెంట్స్ చేశారు. అలాగే స్పానిష్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ కూడా ఉక్రెయిన్‌కు సంఘీభావం తెలిపారు. ఇక నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ ఉక్రెయిన్‌కు మద్దతుగా..న్యాయమైన మరియు శాశ్వత శాంతి కోసం ఉక్రెయిన్ పోరాటంలో మేము దానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
Also Read: ఎవర్రా మీరంతా.. ఇండియాలో ఇద్దరు మగాళ్ల పెళ్లి.. డ్యాన్స్‌లతో హోరెత్తించిన తల్లిదండ్రులు!