Dhurandhar Movie Effect: పాకిస్థాన్‌ను వణికిస్తున్న ‘ధురంధర్-2’.. యాచకులను తనిఖీ చేస్తున్న పోలీసులు

భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్-2' సినిమా ప్రస్తుతం పాకిస్థాన్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాలో చూపించిన పలు సీన్లు పాక్ గూఢచారి సంస్థలకు, పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో తమ దేశంలో భారత ఏజెంట్లు ఉన్నారనే అనుమానంతో తనిఖీలు చేపట్టింది.

New Update
Dhurandhar 2 Effect in Pakistan, Police crackdown in Karachi’s Lyari clip goes viral

Dhurandhar 2 Effect in Pakistan, Police crackdown in Karachi’s Lyari clip goes viral

భారత్‌లో సంచలనం సృష్టిస్తున్న 'ధురంధర్-2' సినిమా ప్రస్తుతం పాకిస్థాన్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఈ సినిమాలో చూపించిన పలు సీన్లు పాక్ గూఢచారి సంస్థలకు, పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. ఆ దేశంలోని కీలక నగరాల్లో భారత ఏజెంట్లు భిక్షాటన చేస్తూ.. అక్కడి రహస్యాలు భారత్‌కు పంపిస్తున్నట్లు సినిమాలో చూపించారు. దీంతో ఈ సినిమా ఎఫెక్ట్‌తో అలెర్ట్ అయిన పాక్ ప్రభుత్వం, తమ దేశంలో నిజంగానే భారత ఏజెంట్లు ఉన్నారేమోనన్న అనుమానంతో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టింది.

Also Read: మహిళలకు గుడ్‌న్యూస్‌... సుప్రీంకోర్టు సంచలన తీర్పు

సినిమాలోని చూపించిన సన్నివేశాలు నిజ జీవితానికి దగ్గరగా ఉండటం వల్ల పాక్ పోలీసులు దేశవ్యాప్తంగా 'స్పై హంట్' (గూఢచారుల వేట)ను ప్రారంభించారు. వీధుల్లో భిక్షాటన చేస్తున్న వాళ్లని.. ఎక్కడైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్లని పట్టుకుని విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భిక్షాటన చేస్తున్నవాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా యాచకుల ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేస్తున్నారు. ధురందర్‌ సినిమాలోని సీన్ ఆధారంగా పాక్‌లోని యాచకులపై ఇంతటి తనిఖీలు చేయడం చర్చనీయాంశమవుతోంది. 

Also Read:  ఇరాన్ సంచలన నిర్ణయం: అమెరికాతో చర్చలకు గ్రీన్ సిగ్నల్!

అయితే ఈ భయానికి ముఖ్య కారణం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గతంలో పాక్‌లో చేసిన పనేనని నిపుణులు భావిస్తున్నారు. అజిత్ దోవల్ తన కెరీర్ ఆరంభంలో దాదాపు ఏడేళ్ల పాటు పాకిస్థాన్‌లో ముస్లిం వేషధారణలో ఉన్నారు. ఆయన భిక్షాటన కూడా చేసినట్లు ప్రచారం ఉంది. అయితే సినిమాలో కూడా ఏజెంట్లు భిక్షటాన చేసేవాళ్ల రూపంలో కనిపించారు. దీంతో పాకిస్థాన్‌ అధికారుల్లో వణుకు మొదలైంది. తమ రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు భారత్‌ మళ్లీ ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందా అనేదానిపై అక్కడ ఆందోళనలు మొదలయ్యాయి. అందుకే పాక్ అధికారులు భిక్షాటన చేసేవాళ్లను పట్టుకుని విచారణ చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు