/rtv/media/media_files/2026/05/22/covid-19-cases-in-singapore-rise-to-12700-2026-05-22-07-35-53.jpg)
Covid-19 cases in Singapore rise to 12,700
ఆరేళ్ల క్రితం వచ్చిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులు ప్రపంచవాప్తంగా చాలావరకు తగ్గిపోయాయి. కానీ ప్రస్తుతం సింగపూర్‌లో మరోసారి కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే (ఈ నెల 10 నుంచి 16 మధ్య) ఏకంగా 12,700 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన రేపుతోంది. అంతకుముందు వారంతో పోల్చి చూస్తే ఇది ఏకంగా 58.8 శాతం భారీగా పెరగడం గమనార్హం. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. అంతకుముందు కూడా రోజువారీ సగటున 56 మంది ఆసుపత్రిపాలు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 73కు చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ‘మెలోడీ’ బజ్‌లోకి ఇండియా పోస్ట్: సరికొత్త మీమ్‌తో స్పీడ్ పోస్ట్ ప్రచారం!
ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడం కొంత ఊరటనిచ్చే విషయమని సింగపూర్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడ వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ 'NB.1.8.1' పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి పెరుగుతండటంతో ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేస్తున్నారు.
Also Read: పుల్వామా పాపానికి ముగింపు.. పీవోకేలో కరడుగట్టిన ఉగ్రవాది హతం!
Follow Us