Corpse flower: 150 కేజీల పువ్వు.. దీని దుర్వాసన అస్సలు భరించలేం: వీడియోలు చూశారా!

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. 'కార్ప్స్ ఫ్లవర్' అనే పిలిచే ఒక పువ్వు వికసించింది. చాలా ఏళ్లకు ఒకసారి మాత్రమే ఈ పువ్వు వికసిస్తుంది. అది కూడా 24 గంటలు మాత్రమే ఉండటం దీని ప్రత్యేకత. దీని బరువు 150 కేజీలు ఉంటుంది.

New Update
Corpse flower at Australia Sydney

Corpse flower at Australia Sydney Photograph: (Corpse flower at Australia Sydney)

కార్ప్స్ ఫ్లవర్ అనే పువ్వు గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ పువ్వు ఎన్నో ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వికసిస్తుంది. అది కూడా కేవలం ఒకరోజు అంటే 24 గంటలు మాత్రమే ఉంటుంది. అదే ఈ పువ్వు ప్రత్యేకత. దీనిని ‘పుట్రిసియా’ అని కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇది అన్ని పువ్వుల్లా మంచి సువాసన కాకుండా భరించలేని దుర్వాసనను వెదజల్లుతుంది.

Also Read: పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

దుర్వాసనను వెదజల్లుతుంది

ఈ పువ్వు కుళ్లిన జంతు కళేబరాలు, తడిసిన సాక్స్‌ల నుంచి వచ్చే దుర్వాసనను పోలి ఉంటుంది. తాజాగా ఈ పువ్వు ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చింది. ఇది సిడ్నీలోని రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లో ఉంది. ఈ పువ్వు వికసించే దృశ్యాన్ని గురువారం లైవ్ స్ట్రీమింగ్ చేశారు.

ఈ ప్రత్యక్ష ప్రసారానికి మొదటగా 8,000 మంది హాజరయ్యారు. ఇక ఆ పువ్వు మెల్ల మెల్లగా తన ఆకారాన్ని మార్చుకుంటుండగా చూసేవారి సంఖ్య అధికంగా పెరిగిపోయింది. ఆ సంఖ్య చూసి రాయల్ బొటానిక్ గార్డెన్స్‌లోని హార్టికల్చర్ డైరెక్టర్ జాన్ సీమన్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పువ్వు వికసించడానికి ముందే దాదాపు 15వేల మంది వీక్షించారని అన్నారు. 

150 కేజీల వరకు బరువు

ఇక ఆ పువ్వుకు దాదాపు 10 ఏళ్ల వయస్సు ఉంటుందని ఆయన అన్నారు. ఆ పువ్వుకు 3ఏళ్ల వయస్సులోనే ఇక్కడకు తీసుకొచ్చామని.. దాదాపు 7 ఏళ్లుగా దానిని సంరక్షిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా చాలా ఆనందంగా ఉందని అన్నారు. కాగా కార్ప్స్ ఫ్లవర్‌ 3 మీటర్లు పొడవు వరకు పెరుగుతుంది. అలాగే ఇది 150 కేజీల వరకు బరువు ఉంటుంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు