Donald Trump : చైనా అంగీకరించింది.. చాలా హ్యాపీ: ట్రంప్‌ ఆసక్తికర పోస్ట్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించిందని ఆయన బుధవారం ప్రకటించారు.

New Update
chin a

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు(US President) డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించిందని ఆయన బుధవారం ప్రకటించారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి శాశ్వతంగా తెరిపించేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిఫలంగా చైనా ఈ నిర్ణయం తీసుకుందని ట్రంప్ పేర్కొన్నారు.

తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్(Truth Social) లో పోస్ట్ చేస్తూ.. హార్ముజ్ జలసంధిని నేను శాశ్వతంగా తెరుస్తున్నందుకు చైనా చాలా సంతోషంగా ఉంది. నేను ఇది చైనా కోసం, ప్రపంచం కోసం చేస్తున్నాను. ఇలాంటి సంక్షోభం మళ్ళీ రాదు. ఇరాన్‌కు ఆయుధాలు పంపకూడదని చైనా అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు.

Also Read :  అమెరికాకు బిగ్ షాక్: పర్షియన్ గల్ఫ్‌లో రూ. 1600 కోట్ల డ్రోన్ మాయం!

మరోవైపు ట్రంప్ హెచ్చరికలు

బీజింగ్‌తో సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెబుతూనే, మరోవైపు ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేశారు. "నేను కొన్ని వారాల్లో చైనా వెళ్లినప్పుడు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నన్ను ఆలింగనం చేసుకుంటారు. మేమిద్దరం కలిసి తెలివిగా పని చేస్తున్నాం. పోరాటం కంటే ఇది మేలు కదా? అయితే గుర్తుంచుకోండి, అవసరమైతే మేము యుద్ధం చేయడంలో కూడా దిట్ట.. అందరికంటే మెరుగ్గా పోరాడతాం" అని తన శైలిలో రాసుకొచ్చారు.

హార్ముజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. దీనిని శాశ్వతంగా తెరుస్తానని ట్రంప్ చెప్పడం ద్వారా ఆ ప్రాంతంపై అమెరికా తన పట్టును పెంచుకోనుందని సంకేతాలు ఇచ్చారు. అయితే ఇరాన్‌కు ఆయుధ సరఫరా నిలిపివేతపై చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. ఇరాన్‌తో చైనాకు ఉన్న దీర్ఘకాలిక సంబంధాల దృష్ట్యా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

Also Read :  ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. కానీ రెండు షరతులు విధించిన అమెరికా

Advertisment
తాజా కథనాలు