China: అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దుల్లో చైనా అణు ఆయుధాలు.. 600 న్యూక్లియర్‌ వార్‌హెడ్‌లు పెంచుకున్న డ్రాగన్

భారత సరిహద్దు వద్ద చైనా మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్‌హెడ్‌లు చేరినట్లు అంచనా.

New Update
China secretly expanding nuclear arsenal just 800 km from Arunachal Pradesh

China secretly expanding nuclear arsenal just 800 km from Arunachal Pradesh

భారత సరిహద్దు వద్ద చైనా(china) మరింత దూకుడు పెంచుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలోని సిచువాన్ ప్రాంతంలో ఉన్న పర్వత లోయల్లో భారీగా అణు ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. గత ఆరు దశాబ్దాలుగా రహస్యంగా ఉన్న ఆ ప్రాంతంలో ఈ మధ్య జరుగుతున్న రసాయన ప్రయోగాలు, నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 2026 ప్రారంభానికి సుమారు 600కి న్యూక్లియర్ వార్‌హెడ్‌లు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రికి న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.

ప్రస్తుతం రష్యా 5400 న్యూక్లియర్ వార్‌హెడ్‌(nuclear weapon) లతో మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా 5100-5200 మధ్య వార్‌హెడ్‌లతో రెండో స్థానంలో ఉంది. చైనా 600 వార్‌హెడ్‌లతో మూడోస్థానానికి చేరినట్లు అంచనాలు వెల్లడవుతున్నాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిచువాన్ ప్రావిన్స్‌లో జిటాంగ్‌, పింగ్టాంగ్ లోయల్లో ఈ అణు స్థావరాలు ఉన్నాయి. వీటిని మావో జెడాంగ్‌ కాలంలోనే థర్డ్‌ ఫ్రంట్ అనే పేరుతో అమెరికా, రష్యా దాడులకు చిక్కకుండా పర్వతాల మధ్య దీన్ని నిర్మించారు. 

ఇక్కడ కొత్త బంకర్లు, భారీ పైపింగ్ సిస్టమ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ ప్రాంతంలో అణు విస్పోటనానికి కావాల్సిన హై-ఎక్స్‌ప్లోజివ్స్‌ను పరీక్షిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్థావరాలు అణుబాంబుల తయారీకి ముఖ్యంగా కావాల్సిన ప్లూటోనియం పిట్స్‌ ఉత్పత్తి కేంద్రంగా మారనున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడి కేంద్రంపై మిషన్ మర్చిపోవద్దు అనే షీ జిన్‌పింగ్‌ నినాదం కూడా రాసిఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్ :ఏడాదికి 2 ఇంజెక్షన్లు చాలు.. ఇక ట్యాబ్లెట్లు బంద్!

చైనా అణు విస్తరణ గతంలో ఎప్పుడూ లేనంతగా వేగంగా పెరుగుతోందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు 2030 నాటికి చైనా తమ అమ్ములపొదిలో 1000 కంటే ఎక్కువ వార్‌హెడ్లను రెడీగా పెట్టుకోవాలని ప్లాన్ చేస్తోంది. కేవలం అణుబాంబుల సంఖ్యను పెంచుకోవడమే కాకుండా వీటిని ప్రయోగించేందుకు భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఆధునిక క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. 

భారత్‌కు ఉన్న ముప్పు 

చైనా అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్ అని పిలుస్తోంది. ఆ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇలాంటి తరుణంలో అక్కడ అణు ఆయుధ సంపత్తిని విస్తరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. సిచువాన్ కేంద్రాలు అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులకు కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి మిసైల్స్‌ ద్వారా భారత్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకోవడం చైనా సులభంగా మారుతుంది. మరోవైపు అరుణాచల్‌తో పాటు లద్దాఖ్ సరిహద్దుల్లో ఇప్పటికే డ్రాగన్ డ్యూయల్ యూజ్‌ (సైనిక, పౌర) గ్రామాలను, ఎయిర్‌ఫీల్ట్‌లను భారీగా నిర్మించింది. 

Also Read: చిన్నారులపై లైంగిక దాడి..  అమెరికాలో ఇండియన్ అరెస్ట్!

భారత్ ఏమంటోంది ?

భారత రక్షణ శాఖ చైనా కదలికలను ఎల్లప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. దానికి కౌంటర్‌గా భారత్‌ అగ్ని-5 లాంటి సుదూర టార్గెట్‌లను ఛేదించే క్షిపణులను కూడా సిద్ధం చేస్తోంది. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులోని అత్యాధునిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ గస్తీని మరింత పెంచింది. 

Advertisment
తాజా కథనాలు