HMPV వైరస్‌ తీవ్రత తక్కువే.. చైనా సంచలన ప్రకటన

చైనాలో HMPV వైరస్ వల్ల ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను ఆ దేశ విదేశాంగ శాఖ ఖండించింది.శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని చెప్పింది. విదేశీయులు చైనాలో పర్యటించడం సురక్షితమేనని పేర్కొంది.

New Update
China'sHMPV Virus

China'sHMPV Virus

చైనాలో ప్రస్తుతం హెచ్‌ఎంపీవీ (HMPV) వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధికి ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మరోవైపు ఈ వైరస్‌ కరోనా లాగే వేగంగా వ్యాపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ హెచ్‌ఎంపీవీ వైరస్‌పై చైనా స్పందించింది. ఈ వైరస్ వల్ల ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని వస్తున్న వార్తలను ఖండించింది. శీతాకాలంలో వచ్చే శ్వాసకోశ వ్యాధుల తీవ్రత గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపింది. అంతేకాదు విదేశీయులు చైనాలో పర్యటించడం సురక్షితమేనని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Also Read: కోరిక తీర్చితే కంప్లైంట్ తీసుకుంటా.. మహిళతో పోలీసు ప్రైవేట్ వీడియో!

 చైనా విదేశాంగ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మాట్లాడుతూ.. '' ఉత్తరార్ధగోళంలో శీతాకాలంలో ఈ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా పెరుగుతాయి. వ్యాదుల తీవ్రత ప్రస్తుతం తక్కువగానే ఉంది. గతేడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తి ఉంది. చైనా పౌరులతో సహా తమ దేశంలో ఉన్న విదేశీయులపై చైనా ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తోంది. చైనాలో పర్యటించడం సురక్షతమేనని'' మావో నింగ్ తెలిపారు. 

Also read: సిరియా మాజీ అధ్యక్షుడు అసద్‌ కు సీరియస్..విష ప్రయోగం అని అనుమానం

ప్రస్తుతం చైనాలో ఇన్‌ఫ్లుయెంజాతోపాటు ఇతర శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిపై అడగగా ఆమె ఇలా సమాధానమిచ్చారు. అలాగే శీతాకాలంలో ఈ వ్యాధులను అరికట్టేందుకు, వీటి నియంత్రణకు సంబంధించి నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్‌లైన్స్‌ కూడా జారీ చేసినట్లు పేర్కొన్నారు.  

Also Read: పానీపూరితో ఏడాదికి రూ.40 లక్షలు.. జీఎస్టీ శాఖ నోటీసులు

Also Read: మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచకండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు