China: హర్మూజ్ వైపు అమెరికా.. దక్షిణ చైనా సముద్రంపై కన్నేసిన చైనా

ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్‌ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది.

New Update
China moves to block entrance to disputed South China Sea shoal

China moves to block entrance to disputed South China Sea shoal

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లారడం లేదు. ఇప్పటికే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్‌ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దక్షణ చైనా సముద్రంలో తమ వ్యూహాత్మక పట్టును పెంచుకుంటోంది. ఫిలిప్పీన్స్ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోకి వచ్చే స్కార్‌బరో షోల్ ప్రాంతాన్ని చైనా పూర్తిగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోంది. 

తాజాగా శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైన సమాచారం ప్రకారం..  చైనా ఆ ప్రాంతంలో సుమారు 350 మీటర్ల పొడవైన తేలియాడే అడ్డంకిని (Floating Barrier) నిర్మించింది. దీంతో ఫిలిప్పీన్స్ జాలర్లు చేపల వేట సాగించే ప్రవేశం మూసుకుపోయింది. ఈ ప్రాంతంపై చైనా వాదనను 2016లో అంతర్జాతీయ న్యాయస్థానం తోసిపుచ్చింది. కానీ బీజింగ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ రక్షణ దళ నౌకలను భారీగా మోహరించి, స్థానిక ఫిలిప్పీన్ మత్స్యకారులను భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తోంది.

Also read: డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పష్టత..జనాభా ప్రాతిపదిక ఒక్కటే కాదు...

 వాస్తవానికి 2012 నుండే ఈ ప్రాంతం చైనా గుప్పిట్లో ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో డ్రాగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తూ అక్కడ శాశ్వత అడ్డంకులను సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాలను ఉల్లంఘించడమేనని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం తీవ్రంగా ఆరోపణలు చేస్తోంది. చైనా చర్యలను వ్యతిరేకిస్తూ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ అమెరికాతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నారు.

 ఫిలిప్పీన్స్ కూడా తమ నౌకాదళం, తీరరక్షక దళాలను ఆ ప్రాంతానికి పంపించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చైనా ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఫిలిప్పీన్స్ దళాలు ఈ వివాదాస్పద ప్రాంతానికి దగ్గర్లో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో ఇది ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఫిలిప్పీన్స్‌కు అండగా నిలుస్తామని అమెరికా చెప్పడంతో ఇది రెండు దేశాల మధ్య సమస్య నుండి అంతర్జాతీయ సంక్షోభానికి దారితీస్తోంది. 

Also Read: పాపం పండింది.. పాక్ లోని ఆ దుర్మార్గుడిపై కాల్పులు.. నడి రోడ్డు మీదే..!

మిడిల్ ఈస్ట్‌లో చమురు రవాణా కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా బిజీగా ఉంది. అందుకే దీన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకొని ఆ ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకు యత్నిస్తోందని భౌగోళిక రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓవైపు పశ్చిమాసియాలో చమురు సంక్షోభం ఆందోళనలు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన దక్షిణ చైనా సముద్ర మార్గం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడటం చర్చనీయమవుతోంది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ ఆధిపత్య పోరుతో ఆసియాలోని సముద్ర భద్రత, స్వేచ్ఛాయుత నౌకాయానం ప్రశ్నార్థకంగా ఉంది. 

Advertisment
తాజా కథనాలు