చైనాలో కుదేలైన రియల్ ఎస్టేట్.. కారణం ఏంటి? భారత్ పై ఎఫెక్ట్ ఉంటుందా?

చైనాలో రియల్ ఎస్టేడ్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఆ దేశ జీడీపీలో 25 శాతం రియల్‌ స్టేట్‌ రంగం వాటానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆస్తి విలువలు దారుణంగా పడిపోయాయి.

New Update
China housing boom turned into a crisis Could India be next?

China housing boom turned into a crisis Could India be next?

చైనాలో రియల్ ఎస్టేడ్ సంక్షోభం రోజురోజుకు పెరుగుతోంది. గతంలో ఆ దేశ జీడీపీలో 25 శాతం రియల్‌ స్టేట్‌ రంగం వాటానే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితులు మారిపోయాయి. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఆస్తి విలువలు దారుణంగా పడిపోయాయి. ఓవైపు ఇన్వెస్టర్లు మరోవైపు సామాన్య ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి రియల్ ఎస్టేట్ ప్రకంపనలు భారత్‌కు కూడా వచ్చే ఛాన్స్‌ ఉందా అనేదానిపై చర్చ నడుస్తోంది. 

బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) డేటా ప్రకారం చూసుకుంటే  చైనాలో 2021లో గృహ ధరల సూచిక 113 పాయింట్లుగా ఉండేది. 2025 చివరి నాటికి 86.79 పాయింట్లకు పడిపోయింది. నాలుగేళ్లలోనే దాదాపు 25 శాతం సంపద నష్టం జరిగింది. చైనాలో ఇప్పుడు 391 మిలియన్ చదరపు మీటర్ల వరకు ఇళ్లు అమ్ముడుపోక ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 2021తో పోలిస్తే ఇది 72 శాతం ఎక్కువ. 2025లో మొదటి 10 నెలల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 14.7 శాతానికి పడిపోయాయి.  

Also Read: ఇరాన్‌పై దాడులు చేయొద్దు.. ట్రంప్‌కు పుతిన్ సంచలన వార్నింగ్

చైనాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇప్పుడు అప్పుల్లో ఇరుక్కున్నాయి. ఎవర్‌గ్రాండే అనే సంస్థ 300 బిలియన్ డాలర్లుకు పైగా అప్పులతో కుప్పకూలింది. చివరికి ఆగస్టు 2025లో స్టాక్ ఎక్స్ఛేంజ్‌ నుంచి బయటికొచ్చేసింది. వాంకే అనే మరో సంస్థ కూడా 2024లో రికార్డు స్థాయిలో 6.8 బిలియన్ డాలర్ల మేర నష్టపోయింది. కంట్రీ గార్డెన్ కంపెనీ సైతం తన బకాయిలు చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ఉండిపోయింది. 

చైనా రియల్‌ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో భారతీయ కొనుగోలుదారులు కూడా ఆందోళన చెందుతున్నారు. రూపాయ విలువ పడిపోవడం, స్టాక్‌ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ఏఐ వల్ల ఉద్యోగ భద్రతా లేకుండా పోవడం లాంటి అంశాల వల్ల భారత్‌లో కూడా రియల్ ఎస్టేట్‌ ధరలు తగ్గొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ ఈ మార్కెట్‌ విషయంలో చైనాకు, భారత్‌కు చాలా తేడా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

భారత్‌పై ఎఫెక్ట్‌

చైనాలో ప్రస్తుతం ఇళ్లు మిగిలిపోతుంటే.. భారత్‌లో మాత్రం ఇళ్ల కొరత ఉంది. పట్టణీకరణ పెరుగుండటం వల్ల ఈ డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది. భారత్‌లో చూసుకుంటే పెట్టుబడిదారుల కన్నా సొంత ఇళ్లు కొనుక్కునే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు స్థిరత్వాన్ని ఇస్తుంది. చైనాలో  ఊహాజనిత పెట్టుబడులు ఉన్నాయి. కానీ భారత్‌లో మాత్రం జనాభా అవసరాలకు తగ్గట్లు ఈ మార్కెట్ పెరుగుతోంది.

Also Read: ఇరాన్‌కు సాయం చేస్తున్న పాకిస్థాన్ ?.. అమెరికాకు వెన్నుపోటు..

Advertisment
తాజా కథనాలు