China: చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా సీఎన్ఎన్ కథనంలో పేర్కొంది. Also Read: క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్? వీటిని లియుజూ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు.వీటిల్లో అనుమానితులను కుటుంబంతో కలవకుండా..న్యాయ సాయం అందించకుండా దాదాపు 6 నెలల వరకు బంధించి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. Also Read: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు! 2012లో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా పార్టీ పై పట్టు బిగిస్తున్నారు.వరుసగా మూడోసారి అధికారం చేపట్టారు.ఆయన మొదటి నుంచి అవినీతి పై పోరాటం పేరిట తన అసమ్మతి వర్గాన్ని జైల్లో వేస్తారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే గతంలో ఉన్న షుయాంగి వ్యవస్థకు చెడ్డపేరు రావడంతో తాజాగా తియుజూ కేంద్రాలతో భర్తీ చేయనున్నారు. Also Read: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి 24 గంటలూ గస్తీ,నిఘా కెమెరాలు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.వీటిల్లో కేవలం కమ్యూనిస్టు పార్టీ అధికారులే కాదు..సివిల్ సర్వెంట్లు,హై ప్రొఫైల్ వ్యక్తులు,వ్యాపారవేత్తలు వంటి వారిని లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 2017-2024 మధ్యలో 210 లియుజూ సెంటర్లను నిర్మించడమో..విస్తరించడమో చేశారు. Also Read: మగవారి కంటే ఆడవారే అది ఎక్కువగా ఫీలవుతున్నారు! సర్వేలో షాకింగ్ విషయాలు ఇక్కడ బంధించిన వారిని కనీసం సరిగ్గా నిద్రకూడా పోనీయరు.వారు దాదాపు18 గంటల సేపు కూర్చొనే ఉండాలని ఈ కేంద్రాల్లో పని చేసిన మాజీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేంద్రాలను నిర్మించడానికి ప్రత్యేకమైన నిబంధనలున్నాయి. అంతేకాకుండా జైల్లో ఖైదీలు తమకు తాము ఎటువంటి హానీ చేసుకోవడానికి వీల్లేకుండా చూడనున్నారు.ఇందుకోసం ప్యాడెడ్ వాల్, యాంటీ స్లీప్ సర్ఫేస్ వంటివి నిర్మించనున్నారు.