/rtv/media/media_files/2026/05/18/child-among-at-least-10-people-shot-dead-by-gunmen-in-central-mexico-2026-05-18-21-18-11.jpg)
Child among at least 10 people shot dead by gunmen in central Mexico
మెక్సికోలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది. ప్యూబ్లా రాష్ట్రంలోని తెహ్‌విట్జింగో మున్సిపాలిటీలో ఓ సాయుధుడు జరిపిన విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు ఉన్నట్లు స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ ఏజెన్సీ వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో స్థానికులు భయంతో పరుగుతు తీశారు.
Also Read: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల వర్షం.. S-400 రక్షణ వ్యవస్థలపై భీకర దాడులు
ఈ కాల్పులకు ఒడిగట్టిన సాయుధుడు ఎవరు ? ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డాడనే విషయాలపై ఇంకా క్లారిటీ లేదు. స్థానిక ముఠాల మధ్య గొడవలా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఘటనా స్థలాన్ని ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు భారీగా మోహరించి గాలింపు చర్యలు చేపట్టారు. మెక్సికోలో ఈ మధ్య సాయుధ ముఠాల హింస పెరగడం కలకలం రేపుతోంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
Also Read: ఇరాన్ సంచలన నిర్ణయం.. అమ్మాయిల చేతుల్లోకి ఏకే-47 తుపాకులు!
Follow Us