/rtv/media/media_files/2025/02/21/Tl8GdEYuNESwR7VMwXUs.jpg)
Pope Francis health critical condition
Pope: ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. 88 ఏళ్ల పోప్ తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతుండగా అధికారులు రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటూ వాటికన్ విడుదల చేసిన ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
మరింత దిగజారిన ఆరోగ్యం..
ఈ మేరకు ఫిబ్రవరి 14న ఆయనకు తీవ్రమైన శ్వాస సమస్య మొదలైంది. దీంతో అధికారులు రోమ్‌లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు ఆక్సిజన్ అందిస్తున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించి రక్తాన్ని మార్చేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమంటూ వాటికన్ ప్రకటన విడుదల చేయడంపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: పదిరోజులకే పెళ్లి పెటాకులు.. హనీమూన్లో గొడవ.. చివరికి బిగ్ ట్విస్ట్!
ఈ మేరకు పోప్.. న్యూమోనియాతోపాటు సంక్లిష్టమైన శ్వాస ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. మరో వారం రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ప్రమాదం నుంచి బయటపడటం కష్టంగానే ఉందని పర్సనల్ ఫిజీషియన్ లూగీ కార్బొన్ చెప్పారు. కానీ ఆయన బాగానే నిద్ర పోతున్నారని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. ఇక పోప్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో 1936లో జన్మించారు. Southern Hemisphere నుంచి పోప్ అయిన తొలి వ్యక్తిగా నిలిచారు. 2013లో పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయగానే పోస్ కేథలిక్ చర్చి అధిపతిగా ఎన్నికయ్యారు.