/rtv/media/media_files/2026/04/18/black-rain-in-tehran-2026-04-18-13-48-38.jpg)
black rain in tehran puts 15 million people at risk as us-iran war
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్చి 7న అక్కడి చమురు నిల్వ కేంద్రాలు, రిఫైనరీలే టార్గెట్‌గా బాంబులతో విరుచుకుపడ్డాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు, కరాజ్ నగరాలపై జరిగిన ఈ దాడులు కేవలం భౌతిక విధ్వంసాన్ని మాత్రమే కాక పర్యావరణ విపత్తును తీసుకొచ్చాయి. ఈ దాడులు ప్రభావం వల్ల వెలువడ్డ కాలుష్య కారకాలు ప్రజలపై నల్లటి వర్షం రూపంలో పడుతున్నాయి. వీటిని చూసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
నల్లటి వర్షం ఎందుకు కురుస్తోంది ?
సాధారణంగా చమురు నిల్వలు దగ్ధమైనప్పుడు పెద్ద ఎత్తున మసి, సూక్ష్మ చమురు రేణువులు గాలిలోకి రిలీజ్ అవుతాయి. ఇవి మేఘాలలో ఉండే నీటి బిందువులతో కలిసి కిందకి కురుస్తాయి. దీన్నే శాస్త్రవేత్తలు 'బ్లాక్ రెయిన్' అని పిలుస్తారు. ఈ ప్రక్రియతో గాల్లో ఉండే విషపూరిత రసాయనాలు నేరుగా భూమిపై పడతాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్నారు. టెహ్రాన్ మెట్రోపాలిత ప్రాంతంలో దాదాపు 1.5 కోట్ల మంది కాలుష్య కొరల్లో చిక్కుకున్నారు. గాలి నాణ్యత కూడా దారుణంగా పడిపోయింది.
Also read: ప్రస్తత సీట్ల ప్రకారమే 2029లో ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు కష్టమే
పీఎం 2.5 స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కన్నా 4 రేట్లు ఎక్కువగా (20.2 మైక్రో గ్రాములు) రికార్డయ్యింది. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి విష వాయువులు గాల్లో కలిసిపోయాయి. ఈ దాడుల వల్ల ఇళ్ల కిటికీలు, తలుపులు ధ్వంసమైన స్థానికులు ఆ విషపూరిత గాలి నుంచి తమను తాము రక్షించుకోలేక అవస్థలు పడుతున్నారు.
ఆ బ్లాక్ రెయిన్, పొగ వల్ల ప్రజల్లో శ్వాసకోస సమస్యలు పెరిగాయి. తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు, చర్మంపై మంటలు, ఆస్తమా లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల ముప్పుగా కూడా పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also read: డీలిమిటేషన్ చిక్కుముడితో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీజేపీ తొందరపడిందా ?
1990-91లో కువైట్ యుద్ధం జరిగిన సమయంలో చమురు బావుల మంటల వల్ల అక్కడి ప్రజల్లో బ్రాంకైటిస్, ఆస్తమా కేసులు భారీగా పెరిగాయి. 2025లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. ఇలాంటి చమురు పొగకు గురైన వాళ్లో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినే ఛాన్స్ మూడు రెట్లు పెరిగినట్లు తేలింది. ఈ 'నల్లటి వర్షం' కేవలం మనుషలు ఆరోగ్యానికే కాకుండా.. వ్యవసాయ భూములను, భవనాలను కూడా దీర్ఘకాలం పాటు దెబ్బతీసే ప్రమాదం ఉందని వైద్యులు, పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Follow Us