/rtv/media/media_files/2025/03/04/Tv5JaNTXgktYhaedpydO.jpg)
Muhammad Yunus
మహ్మద్ యూనస్ (Mohammed Yunus)... ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రాన సలహాదారుడు. మొత్తం ప్రభుత్వాన్ని ఈయనే రన్ చేస్తున్నాడు. అయితే యూనస్ వచ్చిన దగ్గర నుంచీ ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ భారత్ తో గొడవలు పడుతూనే ఉన్నారు. బంగ్లాలో భారతీయులను అవమానించడం, అక్కడ హిందువులపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నారు. అంతేకాదు ఇండియా ఎడ్డెం ఆయన తెడ్డెం అంటూ ప్రవర్తించారు. షేక్ హసిసాను అప్పగించాలంటూ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అక్కడితో ఆగకుండా చైనాతో చేతులు కలిపి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో ఏంటో సడెన్ గా మాట మార్చారు యూనస్.
Also Read : రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్స్ .. ఎవరీ షామా మొహమ్మద్?
Also Read : ఆసీస్ బ్యాటర్ల వేగానికి భారత స్పిన్నర్లు కళ్ళెం వేస్తారా?
మాకు వేరే దారి లేదు..
ఇంకో నెలరోజుల్లో ఏప్రిల్ 3-4 తేదీలలో థాయిలాండ్‌లో BIMSTEC శిఖరాగ్ర సమావేశం జరగనుంది. కరెక్ట్ గా దీని ముందు బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్...బాతర్ తో మంచి సంబంధాలు తప్ప మాకు వేరే దారి లేదు అంటూ ప్రకటించారు. నెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయని అందుకే ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. గత కొంతకాలంగా కొన్ని ప్రచారాలు ఇరు దేశాల మధ్యా వైరాన్ని సృష్టించాయని కూడా అన్నారు. దానిని రూపుమాపడానికి, తమపై ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నామని యూనస్ తెలిపారు. ఇప్పటికీ భారత్, బంగ్లా మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పుకొచ్చారు. రెండు దేశాలు చారిత్రక, రాజకీయ మరియు ఆర్థిక దృక్కోణం నుండి చాలా దగ్గరగా ఉన్నాయి...అందువల్ల మేము ఎప్పటికీ ఒంటరిగా ఉండలేమని చెప్పుకొచ్చారు యూనస్. ప్రస్తుతం ఉన్న అపార్థాలు భవిష్యత్తులో తొలగిపోయి...ఇంతకు ముందులా ఉంటామని అన్నారు.
Also Read: USA: డీప్ సీక్ దెబ్బకు మస్క్ సంపద 90 బిలియన్ డాలర్లు హుష్ కాకి..
Also Read : నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు.. శమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!