/rtv/media/media_files/2025/01/20/trFgvurKd6tNrcDMGCcr.jpg)
Trump likely to sign 100 executive orders Photograph: (Trump likely to sign 100 executive orders)
అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల ప్రచారం దగ్గర నుంచీ చెబుతున్నారు అక్రమ వలసలను అడ్డుకుంటాను అని. ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చిన వారి మీద ఆంక్షలు విధిస్తాను అని కూడా చెప్పారు. అన్నట్టుగానే వచ్చిన దగ్గర నుంచీ ఆ పని మీదే ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న ితర దేశస్థులు వారు దాదాపు 1.40 కోట్లమంది ఉంటారని అంచనా. ఇందులో భారతీయులు సుమారు 7.25 లక్షల మంది ఉన్నారు. మెక్సికో, సాల్వెడార్ ప్రజల తర్వాత ఎక్కువగా ఉన్నది ఇండియన్సే. అక్రమంగా వచ్చిన వారిని వెనక్కు పంపించేస్తానని ట్రంప్ చెప్పారు.
ఇప్పటికే కొత్త అధ్యక్షుడు ట్రంప్ ఇక్కడ ఫుట్టే ఇతర దేశాల వారి పిల్లలకు ఇచ్చే సిటిజెన్ షిప్్ను క్యాన్సిల్ చేసి పడేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదు అంటూ ఈ ఆర్డర్ పై సంతకం చేసిన ట్రంప్ చెప్పారు. అమెరికా మాత్రమే ఇలాంటి ఫెసిలిటీ ఇస్తోందని కూడా అన్నారు. ఆ కారణంగానే అమెరికాలో అంతర్యుద్ధం తర్వాత 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు ఇస్తున్న సిటిజెన్ షిప్‌ను ట్రంప్ రద్దు చేశారు. ఇది భారతీయులకు గట్టి దెబ్బే అని చెప్పాలి. ఇంతకు ముందు విజిటింగ్ వీసాతో అమెరికా వచ్చినా...ఇక్కడ పిల్లలు పుడితే వారికి సిటిజెన్ షిప్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తల్లో, తండ్రికో గ్రీన్ కార్డు లేదా పౌరసత్వం ఉంటేనే తప్ప పిల్లలకు సిటిజెన్ షిప్ రాదు.
ఇప్పుడు తాత్కాలిక వీసాల మీద వచ్చిన వారి మీద కూడా దెబ్బ పడనుందని తెలుస్తోంది. అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగా...సరైన వీసాలు లేనందరినీ లెక్క గట్టి మరీ పంపించేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వంలోనే దాదాపు 1530 మంది భారతీయులను స్వదేశానికి పంపించేశారు. ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ీ సంఖ్య మరింత ఎక్కువ అవనుంది. ఒక యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని, సరిహద్దులు దాటి అగ్రరాజ్యంలోకి వచ్చేందుకు ఇదివరకు వీలుండేది. కొత్త సర్కారు దీనికి చెల్లుచీటీ రాసింది. ఇది కనుక జరిగితే పెద్ద సంఖ్యలోనే అమెరికా నుంచి భారతీయులు ఇంటి ముఖం పట్టాల్సి వస్తుంది. అంతేకాదు ఇండియా నుంచి ఇక్కడకు వచ్చి ఇక్కడ సిటిజెన్ను పెళ్ళి చేసుకుని ఉండిపోవాలని కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. అలాంటివారి నెత్తి మీద అక్రమ వలసల దెబ్బ పడనుంది. అలా ఉండిపోయిన వారిని కూడా ఏరి వెనక్కు పంపించేస్తారని చెబుతున్నారు.