/rtv/media/media_files/2026/05/17/lpg-tanker-symi-2026-05-17-14-25-43.jpg)
Another India-Bound LPG Tanker Symi Safely Crosses Strait Of Hormuz, Reaches Kandla
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మరో ఎల్పీజీ నౌక 'సైమి' హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటి స్వదేశానికి చేరింది. ఆదివారం గుజరాత్‌లోని కాండ్లా పోర్టుకు వచ్చింది. ఈ భాట్యాంకర్‌లో సుమారు 20 వేల టన్నుల LPG గ్యాస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖతార్‌లోని రాస్‌లఫాన్ టెర్మినల్ నుంచి బయలుదేరిన ఈ నౌక మే 13న హర్మూజ్ జలసంధిని దాటింది.
Also Read: రాహుల్, ప్రియాంక వాయనాడ్‌ను మర్చిపోండి.. కాంగ్రెస్‌లో పోస్టర్ల కలకలం!
ఇక మరో నౌక 'సన్‌షైన్' గురువారం హర్మూజ్‌ను దాటినట్లు తెలిసింది. ఇందులో 46,427 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సోమవారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకుంటుందని నౌకాయాన శాఖ తెలిపింది. ఈ రెండు నౌకల్లో వంటగ్యాస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందినట్లు అధికారులు వెల్లడించారు. హర్మూజ్‌పై ఆంక్షలు మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ జలసంధిన దాటిన భారత నౌకల సంఖ్య 13కు చేరింది. ఇక మరో 12 నౌకలు గల్ఫ్‌లోనే చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
Also Read: NEET స్కామ్‌లో మైండ్ బ్లాంక్ మిస్టరీ.. ఒకే ఫ్యామిలీలో 5 మెడికల్ సీట్లు!
Follow Us