Myanmar Earthquake:మయన్మార్‌ను మరోసారి వణికించిన భూకంపం

మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది.దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.మార్చి 28న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు అయ్యింది.

author-image
By Bhavana
New Update
Earthquake in Myanmar and Thailand

Earthquake in Myanmar and Thailand

మయన్మార్ ను మరోసారి భూకంపం వణికించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా నమోదైంది. ప్రాణ భయంతో ప్రజలు బిక్క చచ్చిపోయారు. దీని ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. మార్చి 28న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.7గా నమోదు కాగా... మయన్మార్, బ్యాంకాక్ లో వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి పోయాయి. 

Also Read: WhatsApp: వాట్సాప్ దెబ్బ యూజర్లు అబ్బ.. 97 లక్షల అకౌంట్స్ ఫసక్- మీరు కూడా ఇలా చేస్తున్నారా?

ఒకే రోజు మూడుసార్లు అధిక తీవ్రతతో భూకంపాలు సంభవించడంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ భూకంప ధాటికి 2700 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 4500 మందికి పైగా గాయాలపాలయ్యారు. మరో 500 మండి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. శిథిలాల కింద భారీ సంఖ్యలో జనం చిక్కుకుపోయారని అధికారులు భావిస్తున్నారు. కాగా మయన్మార్, థాయ్ లాండ్ కు సహాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు.

Also Read; HYD Rape Case: జర్మనీ యువతిపై క్యాబ్ డ్రైవర్ రేప్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్- జరిగిందిదే!

ఇప్పటికే వివిధ దేశాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను పంపిస్తున్నాయి. అయితే వీళ్లు అక్కడికి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆటంకం కలిగిస్తున్నాయి.దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్  అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే భారత్‌..ఆపరేషన్‌ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు,దుప్పట్లు,స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. 

అటు అమెరికా,ఇండోనేషియా,చైనా కూడా అవసరమైన సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా -గుటెరస్‌ వెల్లడించారు.

Also Read: Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు

Also Read: Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో!

massive earthquake in myanmar | myanmar earthquake | myanmar earthquake today | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment