అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. AIతో హెచ్‌1బీ వీసాలకు డిమాండ్

ఇటీవల ట్రంప్‌ సర్కార్‌ H1బీ వీసాలకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.అయినప్పటికీ కూడా టెక్‌ కంపెనీలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. H1బీ వీసాదారుల వైపే చూస్తున్నాయి.

New Update
H-1B visas find new use as US tech giants hire AI talent

H-1B visas find new use as US tech giants hire AI talent

ఇటీవల ట్రంప్‌ సర్కార్‌ H1బీ వీసాలకు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే. ఈ వీసా ధరను ఏకంగా లక్ష డాలర్లకు నిర్ణయించింది. అమెరికన్ టెక్ కంపెనీలు విదేశీ నియామకాలను తగ్గించి అమెరికన్లకే అవకాశాలు ఎక్కువగా ఇచ్చేలా ట్రంప్‌ సర్కార్‌ ఇలాంటి కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. అయినప్పటికీ కూడా టెక్‌ కంపెనీలు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. H1బీ వీసాదారుల వైపే చూస్తున్నాయి.  

ప్రస్తుతం ఏఐ రంగంలో అక్కడి టెక్‌ కంపెనీలు భారీగా ఇన్వెస్ట్‌మెంట్‌లు చేస్తున్నాయి. దీంతో ఆయా కంపెనీలు ఎక్కువగా విదేశీ టాలెంట్‌నే నమ్ముకుంటున్నాయి. దీంతో హెచ్‌1బీ వీసాలకు భారీగా డిమాండ్ పెరుగుతోందని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (NFAP) నివేదిక తెలిపింది. ఇమిగ్రేషన్‌కు సంబంధించిన డేటాను అధ్యయనం చేసి ఇది రిపోర్టును విడుదల చేసింది.  

Also Read: దారుణం.. తోటి విద్యార్థిని కాల్చి చంపి సూసైడ్‌ చేసుకున్న స్టూడెంట్.. వీడియో వైరల్

మొత్తానికి 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త H1B వీసాల జారీ కోసం టెక్‌ కంపెనీలు లేబర్‌ కండీషన్స్‌ దరఖాస్తులు ఇచ్చాయి. వీటిల్లో 80 శాతానికి పైగా ఏఐ సంబంధిత నియామకాలే ఉన్నాయని NFAP నివేదిక వెల్లడించింది. ఎక్కువగా అమెజాన్, మెటా, గూగుల్‌,మైక్రోసాఫ్ట్‌,యాపిల్‌ లాంటి కంపెనీలు ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ రీసెర్చ్‌ సైంటిస్టులు, డేటా సైంటిస్టుల పోస్టుల కోసం ఈ కంపెనీలు హెచ్‌1 బీ వీసాదారులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. 

ఇదిలాఉండగా 2025లో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, యాపిల్‌ కంపెనీలు ఏఐపై 380 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. రాబోయే రోజుల్లో ఈ రంగంపై ఇంకా భారీగా ఖర్చులు చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎలాగైనా హెచ్‌1 బీ వీసా ధరలను భరించి విదేశీ ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నాయి. 

Also Read: ఢిల్లీకి రానున్న సుందర్ పిచాయ్, శామ్‌ ఆల్ట్‌మన్.. హోటల్‌ ధరలకు రెక్కలు.. ఒక్క రోజుకు రూ.32 లక్షలు

Advertisment
తాజా కథనాలు