/rtv/media/media_files/2025/04/06/oldcuGlhLlRInK9pU6Rk.jpg)
Trump Tariffs
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బ ఓ మోత మోగిస్తోంది. దీని వలన పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి రైతులు, వినియోగదారులు వరకూ అందరూ బెంబేలెత్తిపోతున్నారు. ఎగుమతులు ఆగిపోతాయని, ధరలు పెరుగుతాయని ఆవేదన పడుతున్నారు. విదేశీ ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాలు పెంచేశారు. దీంతో అమెరికాలోకి దిగుమతయ్యే వస్తువులు తగ్గిపోతాయి. దాంతో వాటి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు ఇదే ఆవేదన అమెరికా ప్రజలను ఆందోళనలో పడేసింది. మరోవైపు తమ ఉత్పత్తులకు గిరాకీ తగ్గతుందని రైతులు భయపెడుతున్నారు.
స్టోర్లకు పరుగెడుతున్న జనాలు..
అమెరికాలో చాలా ఏళ్ళుగా ద్రవ్యోల్బణం ఎదుర్కొంటోంది. దాంతో అక్కడ అన్ని వస్తువుల రేట్లూ బాగా పెరిగిపోయాయి. దానికి తోడు ఇప్పుడు సుంకాల దెబ్బ ఒకటి. దీంతో అమెరికాలో చాలా వస్తువుల రేట్లు పెరగనున్నాయి. ఇలా అవ్వక ముందే ఆ వస్తువులను కొనుక్కు తెచ్చుకోవాలని అమెరికన్లు ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. తైవాన్ పై ట్రంప్ 32 శాతం సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరుగుతాయి. దీంతో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, కెమెరాలకు ప్రస్తుతం డిమాండు పెరిగింది. కార్లు, ఇతర గృహోపకరణాలకూ పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని కంపెనీలు చెబుతున్నాయి.
వ్యవసాయం పైనా..
ట్రంప్ సుంకాల ప్రభావంతో అమెరికా వ్యవసాయంపైనా పడుతోంది. ఆ దేశానికి అతి పెద్ద మార్కెట్ చైనా. ఇప్పుడు ట్రంప్ వలన చైనా కూడా సుంకాలను పెంచేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో పండే సోయాబీన్, జొన్నల్లో 50 శాతం చైనాకు ఎగుమతి అవుతాయి. వీటితో పాటూ మొక్కజొన్న, బీఫ్, చికెన్ లను కూడా చైనానే ఎక్కువగా ఎగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు చైనా సుంకాలను 34శాతం పెంచేసింది. దాంతో వాటికి డిమాండ్ తగ్గనుంది. దాంతో పాటూ ట్రంపం సుంకాలను పెంచిన వెంటనే అమెరికాలో పంట ధరలు తగ్గిపోయాయి. కొత్త సుంకాలతో చాలా మంది వ్యవసాయాన్ని వదిలేసే అవకాశముందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ దేశంలో తయారయ్యే ‘బైజియు’ మద్యాన్ని తయారు చేసేందుకు అమెరికా నుంచి జొన్నలను చైనా దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు ఇతర దేశాలకు ఆ దేశం ఆర్డర్లు ఇస్తే అమెరికా రైతులు నష్టపోతారు. లాస్ట్ టైమ్ ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో రైతులు ట్రంప్ కు సపోర్ట్ చేశారు. అప్పుడు కోట్ల డాలర్లు వారికి సాయం చెయ్యడమే కారణం. కానీ ఈసారి ట్రంప్ అలా చేస్తారా లేదా తెలియదు. చేసినా కూడా రైతులు అందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
today-latest-news-in-telugu | usa | trump tariffs | cars | laptop
ఇది కూడా చదవండి: శ్రీరామ నవమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఇదే