/rtv/media/media_files/2025/03/01/HzYsCVQhGbwedIeiwtUu.jpg)
Zelenskyy Vs Trump
Zelenskyy Vs Trump: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వివాదంపై ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. 'రష్యా తక్షణమే శాంతి కావాలంటోంది కానీ జెలెన్‌స్కీ శాంతిని కోరుకోవట్లేదు. ఆయన కొంచెం అతి చేసినట్లు మాకు అనిపించింది. జెలెన్‌స్కీ మాటలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నాయి' అన్నారు ట్రంప్.
రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ..
ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. 'రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగాలని మేము కోరుకుంటున్నాం. శాంతి చర్చలను కోరుతున్నాం. కానీ జెలెన్‌స్కీ ఇందుకు సిద్ధంగా లేడని అనిపిస్తోంది. వైట్ హౌస్ సమావేశంలో అతను కొంచెం అతి చేసినట్లు అనిపించింది. మరో పదేళ్లు యుద్ధానికి వెళ్లాలని మేము కోరుకోవట్లేదు. కానీ తక్షణమే శాంతి కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ కోరుతున్నారు. కాబట్టి ఈ యుద్ధం ఇంతటితో ముగించాలనుకుంటున్నాం' అని ట్రంప్ స్పష్టం చేశారు.
Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!
ఇక జెలెన్‌స్కీతో మరోసారి శాంతిచర్చలు కొనసాగిస్తారా అనే ఓ విలేకరి ప్రశ్నకు... ఆయన శాంతికోసం రావాలని కోరుకుంటున్నారు. కానీ అందుకు మేము సిద్ధంగా లేము. ఆయన అలాంటి వ్యక్తే కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వివాదంపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వైట్ హౌస్ వేదికగా ఈ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే జెలెన్ స్కీ శ్వేథసౌధంనుంచి వెళ్లిపోయారు. అయితే ఈ ఇష్యూపై మీడియాతో మాట్లాడిన జెలెన్ స్కీ.. తాను ట్రంప్‌కు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్ రిలీఫ్.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం