USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు..

అమెరికాలో ఇప్పటికే అన్నింటి ధరలూ చాలా పెరిగిపోయాయి. గుడ్లు లాంటి వాటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే కొత్త టారీఫ్ ల వలన మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయని తెలుస్తోంది. టాయిలెట్ పేపర్ కు కూడా కొరత వస్తుందని చెబుతున్నారు. 

New Update
Trump

Trump

ట్రంప్ విధించిన టారీఫ్ లపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే దేశాలు ఎంత విధిస్తే తామూ అంతే విధిస్తామని ట్రంప్ మొండిపట్టు పట్టుకుని కూర్చొన్నారు. దీంతో కెనడా లాంటి దేశాలు ప్రతీకార చర్యలకు దిగింది. సుంకాలను అమాంతం పెంచేసింది. దానికి తోడు ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి కొత్త టారీఫ్ లు అమల్లోకి వస్తున్నాయి.  ముఖ్యంగా కెనడాపై విధించే సుంకాలు అమెరికాపై అత్యధికంగా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే సాఫ్ట్ వుడ్ పై బాగా ఎఫెక్ట్ పనుంది. దీనివలన అమెరికాలో యూజ్ చేసే టాయిలెట్ పేపర్ కు కొరత రావొచ్చని చెబుతున్నారు.

అంతా కెనడా కలపే..

కెనడాతో పాటూ ఇతర దేశాల మీదా ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యారు ట్రంప్. ఈ నిర్ణయంలో మార్పు లేదని తేల్చి చెప్పేశారు. దీని ప్రకారం ఇంతకు ముందు కెనడా కలపపై ప్రస్తుతం 14శాతం సుంకాలు వసూలు చేస్తుండగా.. అది ఇప్పుడు 27శాతానికి పెరగనుంది. దీంతో  ఈ ఉత్పత్తుల ధర 50శాతం పెరిగే అవకాశం ఉంది.  టాయిలెట్‌ పేపర్లు, పేపర్‌ టవళ్లు తయారీలో ఉపయోగించే ఎన్‌బీఎస్‌ కలప గుజ్జు లభ్యతపై ప్రభావం చూపించనుంది. దీని వలన ఆ ఉత్పత్తుల కొరత ఏర్పడటం లేదంటే ధరలు విపరీతంగా పెరుగుతాయని అంటున్నారు. ఎందదుకంటే పేపర్ ఉత్పత్తుల కోసం అమెరికా మిల్లులన్నీ ఎక్కువగా కెనడా కలపపైనే ఆధారపడుతున్నాయి. ఇక్కడ ఉపయోగించే టాయిలెట్‌ పేపర్లలో 30శాతం, పేపర్ టవళ్లలో సగం వాటా ఈ కలపదే. గతేడాది 20లక్షల టన్నుల ఎన్‌బీఎస్‌కేను అమెరికా దిగుమతి చేసుకుంది. ఇప్పుడు సుంకాలు పెరిగితే దిగుమతులు తగ్గుతాయి. దాంతో ఉత్పత్తులతయారీ కూడా తగ్గుతుంది.

today-latest-news-in-telugu | usa | trump tariffs | canada 

Also Read: Ramadan Festival: దుబాయ్ లో 30న, ఇండియాలో 31 ఈద్.. 

Advertisment
Advertisment
Advertisment