/rtv/media/media_files/2026/03/07/gun-firing-2026-03-07-13-50-00.jpg)
8 children killed in mass shooting in America
America : అమెరికాలోని లూసియానా(louisiana) రాష్ట్రంలో శనివారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల(mass shootings usa) ఘటన సభ్యసమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ష్రీవ్‌పోర్ట్ నగరంలో ఒక దుండగుడు తన సొంత బిడ్డలతో సహా ఎనిమిది మంది చిన్నారులను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. కుటుంబ కలహాలే నేపథ్యంగా సాగిన ఈ మారణకాండలో, నిందితుడు వెస్ట్ 79 స్ట్రీట్‌లోని రెండు ఇళ్లు, అలాగే హారిస్ స్ట్రీట్‌లోని మరో నివాసంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మరణించిన చిన్నారులంతా 1 నుంచి 14 ఏళ్ల లోపు వారేనని, ఈ దాడిలో మరో ఇద్దరు మహిళలు కూడా తలకు తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
Also Read : హోటళ్లు సీజ్, మార్కెట్లు, బస్టాప్ లు క్లోజ్.. గల్లీల్లో వేల మంది సైనికులు.. పాక్ లో అసలేం జరగబోతోంది?
Mass Shooting In America
Eight children killed in shooting in the US, according to The New York Times.
— lone wolf (@MApodogan) April 19, 2026
The incident occurred in Shreveport. According to police, the dead ranged in age from 1 to 14 years old, and two others were reported injured.
The shooter stole a car while trying to escape and was… pic.twitter.com/yOLLTVoMje
Also Read : ఇది బ్రహ్మోస్ కాదు, అగ్ని-5 అంతకన్న కాదు.. కానీ, కనురెప్పపాటులో లక్ష్యాలను ఛేదిస్తుంది... అదేంటో తెలుసా?
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 6 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఘాతుకానికి పాల్పడిన అనంతరం నిందితుడు ఒక కారును దొంగిలించి పారిపోతుండగా, పోలీసులు అతడిని వెంబడించారు. బోసియర్ సిటీ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి చెందినట్లు ష్రీవ్‌పోర్ట్ పోలీస్ చీఫ్ వేన్ స్మిత్ ధృవీకరించారు. ఈ ఘోరకలిపై ష్రీవ్‌పోర్ట్ మేయర్ టామ్ ఆర్సెనో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఇది నగర చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజని అభివర్ణించారు. యూఎస్ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ సైతం బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరోవైపు, అయోవా యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో కూడా ఆదివారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. బార్లు, రెస్టారెంట్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలివానలా మారి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా, క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు, అయితే ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం.
లూసియానాలో జరిగిన ఈ ఊచకోత అమెరికాలో గత రెండేళ్లలో జరిగిన అత్యంత భయంకరమైన మాస్ షూటింగ్‌గా రికార్డులకు ఎక్కింది. పసిపిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వరుస ఘటనలు అమెరికాలోని గన్ కంట్రోల్ చట్టాల అమలులోని వైఫల్యాలను మరోసారి ఎత్తిచూపుతున్నాయి. ఆయుధాల సంస్కృతిపై కఠినమైన నియంత్రణలు ఉండాలని, ఇలాంటి ఉన్మాద చర్యలు పునరావృతం కాకుండా చూడాలని పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Follow Us