Crime News : కెనడాలో ముగ్గురు భారతీయులు మృతి

కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.

New Update
Crime News : కెనడాలో ముగ్గురు భారతీయులు మృతి

Canada : కెనడాలో ముగ్గురు భారతీయులు(Indians) ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదం(Road Accident) లో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒంటారియో రాష్ట్రంలో ఓ దొంగ వైన్ షాప్‌లో దొంగతనం చేశాడు. సమాచారం మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. అతడు కారులో పారిపోయాడు. దీంతో పోలీసులు తమ వాహనంలో ఆ దొంగను వెంబడించారు.

Also read: ఈ దేశంలో డిజిటల్, రవాణా పూర్తిగా ఉచితం.. ఎక్కడంటే ?

దీంతో ఆ దొంగ రాంగ్‌ రూట్‌లో వెళ్లడంతో.. భారతీయులు వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ రోడ్డు 60,55 ఏళ్ల వయసున్న ఇద్దరు భారతీయ వృద్ధులు, వాళ్ల 3 నెలల మనువడు మృతి చెందారు. మూడు నెలల చిన్నారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఇండియాకు చెందిన ఆ వృద్ధ దంపతులు తమ కూతురు ఫ్యామిలీని చూసేందుకు కెనడాకు వచ్చారని.. ఈ క్రమంలోనే వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

Also Read: అమిత్‌ షాపై కేసు నమోదు.. ఏ3గా చేర్చిన పోలీసులు

Advertisment
Advertisment
తాజా కథనాలు