/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Post-Office-Insurance-jpg.webp)
Insurance Claim: ఏదైనా ప్రమాదం జరిగినపుడు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రమాద బీమా తీసుకుంటాం. అయితే, చాలామంది దీనిని క్లెయిమ్ చేసే విషయంలో చిక్కులు ఎదుర్కుంటారు. ఎందుకంటే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ సమకూర్చుకోలేకపోవడం.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఏ విధమైన ప్రొసీజర్ ఉంటుందో ఎక్కువ మందికి అవగాహన ఉండదు. దీంతో ఇబ్బందులు పడతారు. ఒక్కోసారి క్లెయిమ్ రిజెక్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు ప్రమాద బీమా క్లెయిమ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
దేశంలో చాలా పనులు డిజిటల్‌గా జరుగుతున్నప్పటికీ, బీమా క్లెయిమ్ ప్రక్రియ(Insurance Claim) సాధారణ ప్రజలకు సంక్లిష్టంగా - ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటోంది. ఏదైనా సంఘటనలో కుటుంబంమొత్తం ప్రమాదానికి గురైనప్పుడు, ఈ పని మరింత కష్టం అవుతుంది. ప్రమాదం జరిగినప్పుడు క్లెయిమ్ చేయడానికి ఎఫ్‌ఐఆర్ అవసరమా లేదా అనేది పెద్ద చర్చనీయాంశంగా ఉంటుంది. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదైతే, పోలీసుల విచారణపై బీమా కంపెనీకి నమ్మకం ఉంటుంది. ఇది క్లెయిమ్‌ను పొందడం సులభతరం చేస్తుంది.
ఈ విషయంలో ఇన్సూరెన్స్ రంగ నిపుణులు ప్రమాదంలో ఏదైనా నష్టం జరిగితే క్లెయిమ్(Insurance Claim) గురించి ముందుగా తెలియజేయాల్సింది బీమా కంపెనీకే అని చెబుతున్నారు. ఈ సమాచారాన్ని బీమా కంపెనీ ఇమెయిల్ ID లేదా హెల్ప్‌లైన్ నంబర్‌లో ఇవ్వవచ్చు. ఇందులో పాలసీ వివరాలను తెలియజేయడం ముఖ్యం. సమాచారం ఇవ్వడానికి ఎఫ్‌ఐఆర్ అవసరం లేదు. సమాచారం అందుకున్నప్పుడు, బీమా కంపెనీ అవసరమైన పత్రాల జాబితాను ఇస్తుంది. క్లెయిమ్ ఫారమ్‌తో పాటు పూర్తి డాక్యుమెంట్లు అందిన తర్వాత, బీమా కంపెనీ బీమా మొత్తాన్ని విడుదల చేస్తుంది.
Also Read: ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం టెన్షన్.. ఎంత పెరిగిందంటే..
రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఎఫ్‌ఐఆర్ తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాతే పోలీసులు పోస్ట్‌మార్టం నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితిలో, బీమా కంపెనీ క్లెయిమ్(Insurance Claim) చెల్లించే ముందు FIR - పోస్ట్ మార్టం నివేదికను అడుగుతుంది. ఒక వ్యక్తి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందినట్లయితే, క్లెయిమ్ ఫారమ్‌తో పాటు వైద్య నివేదికను కూడా సమర్పించాలి. ఈ నివేదికలను అధ్యయనం చేసిన తర్వాతే బీమా కంపెనీ క్లెయిమ్‌ను ఆమోదిస్తుంది.
ఈ పత్రాలు అవసరం
బీమా క్లెయిమ్(Insurance Claim) కోసం, పాలసీ కాపీ, మరణించిన వ్యక్తి చిరునామా- ఐడి ప్రూఫ్, ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్ మార్టం ఇవ్వవలసి ఉంటుంది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లయితే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనితో పాటు, నామినీ KYC, బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించాలి. నామినీ పాలసీలో నమోదు కానట్లయితే, లీగల్ హయ్యర్ సర్టిఫికేట్ అంటే చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.
బీమా క్లెయిమ్‌ను ఎప్పుడు చేయవచ్చు?
అయితే, బీమా క్లెయిమ్(Insurance Claim)ను ఎప్పుడు దాఖలు చేయవచ్చనే దానిపై ఎటువంటి కాలపరిమితి లేదు. సాధారణంగా ఇది సంఘటన జరిగిన 30 రోజులలోపు దాఖలు చేయాలి. 30 రోజుల తర్వాత క్లెయిమ్ చేసినట్లయితే, క్లెయిమ్ ఆలస్యం కావడానికి బీమా కంపెనీ సరైన కారణాన్ని అడగవచ్చు. క్లెయిమ్‌కు సంబంధించిన పూర్తి పత్రాలు అందిన తేదీ నుంచి ఒక నెలలోపు బీమా కంపెనీ క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించాలి. బీమా క్లెయిమ్ చేస్తున్నప్పుడు, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను కలిపి సమర్పించండి. కాగితాలు పూర్తిగా లేకపోతే, బీమా కంపెనీ వ్రాతపూర్వక నోటీసు పంపిస్తుంది. అప్పుడు దరఖాస్తుదారు మళ్లీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం వృథా అవుతుంది, కాబట్టి అసంపూర్ణ సమాచారం ఇవ్వవద్దు. బీమా కంపెనీ ఏదైనా సమాచారం అడిగితే, దానికి సరైన - స్పష్టమైన సమాచారం ఇవ్వండి. సమాచారం ఇస్తున్నప్పుడు మీరు మీ స్టేట్‌మెంట్‌ను పదేపదే మార్చినట్లయితే, మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.
Watch this interesting Video: