Amit Shah: 'ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని అంతం చేయాలని చూస్తున్నారు'.. ఉదయనిధిపై అమిత్ షా ఫైర్.. ఓరాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో బీజేపీ 'పరివర్తన్ సంకల్ప్ యాత్ర'లో పాల్గొన్నారు అమిత్ షా. ఈ సందర్బంగా ప్రసంగించిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి గత రెండు రోజులుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని, కేవలం టు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మంపై విమర్శలు చేస్తున్నారన్నారు. By Shiva.K 03 Sep 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Home Minister Amit Shah: సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఉదయనిధి ప్రకటనపై అధికార ఎన్డీయే కూటమి(NDA) ప్రతిపక్షాలపై మండిపడుతోంది. తాజాగా ఉదయనిధి ప్రకటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా ముఖ్యమంత్రి కుమారుడు మాట్లాడుతున్నారని అమిత్ షా విపక్షాలపై మండిపడ్డారు. విపక్ష నేతలంతా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆదివారం ఓరాజస్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో బీజేపీ 'పరివర్తన్ సంకల్ప్ యాత్ర'లో పాల్గొన్నారు అమిత్ షా. ఈ సందర్బంగా ప్రసంగించిన ఆయన.. విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి గత రెండు రోజులుగా సనాతన ధర్మాన్ని అవమానిస్తోందని, కేవలం టు బ్యాంకు రాజకీయాల కోసమే డీఎంకే, కాంగ్రెస్ నేతలు సనాతన ధర్మంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఆ ఇద్దరినీ టార్గెట్ చేస్తూ ఫైర్ అయిన అమిత్ షా.. 'భారత సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదు. గతంలో మన్మోహన్ సింగ్ కూడా బడ్జెట్‌పై మైనారిటీలకు మొదటి హక్కు ఉందని అన్నారు. కానీ, పేదలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వారికి మొదటి హక్కు ఉందని మేం అంటున్నాం. మరోసారి మోదీ గెలిస్తే సనాతన్ రాజ్య పాలన వస్తుందని కాంగ్రెస్ చెబుతోంది. లష్కరే తోయిబా పాలన కంటే కంటే హిందూ సంస్థ ప్రమాదకరమని రాహుల్ గాంధీ అన్నారు.' అంటూ రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. మోదీ ప్రభుత్వం పేద ప్రజల కోసం, వారి బాగు కోసం పని చేస్తుందని పేర్కొన్నారు అమిత్ షా. #WATCH | Rajasthan | Union Home Minister Amit Shah says, "...For the last two days INDIA alliance is insulting 'Sanatana Dharma'. Leaders of DMK and Congress are talking about ending 'Sanatana Dharma' just for vote bank politics. This is not the first time they have insulted our… pic.twitter.com/7yylv3gbkV — ANI (@ANI) September 3, 2023 గెహ్లట్ ప్రభుత్వం ఇంటిబాట పట్టే సమయం ఆసన్నమైంది.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై అమిత్ షా విరుచుకుపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వం నిష్క్రమించే సమయం ఆసన్నమైందన్నారు. పదేళ్లపాటు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉందని, యూపీఏ ప్రభుత్వం రాజస్థాన్ ప్రజలకు ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. 10 ఏళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్‌కు రూ.1.60 లక్షల కోట్లు ఇవ్వగా, మోదీ ప్రభుత్వం కేవలం 9 ఏళ్లలో రాజస్థాన్‌కు రూ.8.71 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పుకొచ్చారు హోంమంత్రి అమిత్ షా. ఉదయనిధి కామెంట్స్‌పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు ఆగ్రహం.. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి' అంటూ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిచ్చి మాటలు ఆయనకు మంచిది కాదంటూ హితవు చెప్పారు. 'తమిళనాడు సీఎం కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటన చూశాం. క్యాబినెట్ మంత్రిగా, రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నారు. ఆయన ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. సనాతన ధర్మం గురించి ఆయనకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలంటూ హితవు చెప్పారు.' #WATCH | Hyderabad, Telangana: On Tamil Nadu Minister Udhayanidhi Stalin's 'Sanatana Dharma should be eradicated' remark, Rangarajan head priest of Chilkur Balaji Temple, says, "We have seen the statement of Udhayanidhi Stalin, son of the present CM of Tamil Nadu and who is also… pic.twitter.com/LVxsSZQuTw — ANI (@ANI) September 3, 2023 Also Read: Telangana Elections: మహిళా ప్రతినిధుల్లో సరికొత్త జోష్.. కాంగ్రెస్ నుంచి ఎంతమంది పోటీకి సిద్ధమయ్యారో తెలిస్తే అవాక్కే.. Telangana Elections: జనగామ ఎమ్మెల్యేనా మజాకా.. టౌన్ సెంటర్‌లో చొక్కా విప్పిన ముత్తిరెడ్డి.. అసలేమైందంటే.. #congress #pm-modi #rahul-gandhi #bjp #amit-shah #rajasthan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి