Hi Nanna Movie: నానీ ఎమోషన్.. సన్ ఎఫెక్షన్.. పిక్ అదిరిపోయింది నాన్న!

నాని సినిమా హాయ్..నాన్న థియేటర్లలో సందడి చేస్తోంది. నాని అతని కొడుకు జున్నూ కలిసి సినిమా చూస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సినిమా చూస్తున్న నాని ఎమోషన్ అవడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఈ  సినిమా ఎమోషనల్ లవ్ డ్రామాగా అందరినీ ఆకట్టుకుంటోంది. 

New Update
Hi Nanna Movie: నానీ ఎమోషన్.. సన్ ఎఫెక్షన్.. పిక్ అదిరిపోయింది నాన్న!

Hi Nanna Movie: నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా హాయ్.. నాన్న. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నాని..మృణాల్..బేబీ కియారా నటనకు విమర్శకుల నుంచి ప్రశంశలు రావడమే కాకుండా.. రివ్యూలు కూడా చాలా పాజిటివ్ గా వస్తున్నాయి. దీంతో నాని మరో డీసెంట్ హిట్ కొట్టాడని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు సినిమా చూసిన ప్రేక్షకులు బుక్ మై షో లో పూర్తి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. 9.3 రేటింగ్ ఇచ్చారు. హార్ట్ టచింగ్ పాయింట్ తో కొత్త దర్శకుడు శౌర్యువ్‌ ఎక్కడా తడబడకుండా ఎమోషనల్ టచ్ తో ఫీల్ గుడ్ మూవీ ఇచ్చాడని ప్రేక్షకులు చెబుతున్నారు. ఫ్యామిలీ అంతా కల్సి చూడాల్సిన సినిమా అంటున్నారు. దీంతో నాని సినిమా హిట్ బాటలో పడిందని ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 

Also Read: పిచ్చ మాస్.. ఇరవైనాలుగు గంటలూ అదే.. యానిమల్ కొత్త రికార్డ్!

హాయ్..నాన్న(Hi Nanna Movie) సినిమా ఎమోషనల్ ఎంటర్టైనర్. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చాలాసార్లు ఎమోషన్ ఆపుకోలేకపోయినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఒక ఫోటో ట్రెండ్ అవుతోంది. ఇది పిక్ ఆఫ్ డే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ పిక్ లో నాని.. అతని కొడుకు జున్నూ ఉన్నారు. వీరిద్దరూ హాయ్..నాన్న సినిమా థియేటర్ లో చూస్తున్నారు. సినిమా చూస్తున్న నాని కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి. నాని కొడుకు జున్నూ తండ్రిని హగ్ చేసుకుని సినిమా చూస్తున్నాడు. ఈ పిక్ ఇంత ఎమోషనల్ గా ఉంటే.. సినిమాలో ఇంకెంత ఎమోషన్ ఉందో  అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అన్నట్టు ఈ పిక్ ను నాని భార్య అంజు షేర్ చేశారు. ఆ ఫోటో ఇక్కడ మీరూ చూసేయవచ్చు. 

Nani

మొత్తమ్మీద నాని హాయ్.. నాన్న(Hi Nanna Movie) కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సినిమాగానే కనిపిస్తోంది. దీంతో నాని పెద్ద హిట్ తన ఎకౌంట్ లో వేసుకున్నట్టు అనిపిస్తోంది. నితిన్ సినిమా శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. దానిమీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఫలితం పై హాయ్.. నాన్న వీకెండ్ కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. చూద్దాం ఏమి జరుగుతుందో. 

నాని హీరోగా శౌర్యువ్‌ దర్శకత్వంలో రూపొంది నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న(Hi Nanna Movie) సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడంతో పాటు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నాని మొదటి నుంచి చెబుతున్నట్లుగానే ఈ సినిమాలో నాన్న గా అలరించాడు. అంతే కాకుండా హాయ్‌ నాన్న సినిమాతో హిట్‌ కూడా అందుకున్నట్లుగా టాక్‌ వినిపిస్తోంది.

Watch this interesting Video:

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijay Devarakonda: "లవ్‌ యూ అన్నా".. అల్లు అర్జున్‌కు విజయ్‌ దేవరకొండ సర్ప్రైజ్‌ గిఫ్ట్‌..

విజయ్‌ దేవరకొండ హైదరాబాద్ లో తన కొత్త రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా అల్లు అర్జున్‌ కు గిఫ్ట్‌ పంపగా, బన్నీ‘‘స్వీట్‌ బ్రదర్‌’’ అంటూ స్పందించాడు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం మరోసారి హైలైట్ అయింది.

New Update
Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda - Allu Arjun

Vijay Devarakonda: టాలీవుడ్‌ యూత్ ఐకాన్ అల్లు అర్జున్‌(Allu Arjun), రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ ఇద్దరూ మంచి స్నేహితులని సినీ పరిశ్రమలో అందరికి తెలిసిన విషయమే. అయితే ఇద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉన్న సాన్నిహిత్యాన్ని తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తెలిపారు.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

మై స్వీట్‌ బ్రదర్‌..

హైదరాబాద్‌లో తన "రౌడీ" బ్రాండ్ స్టోర్‌ను(Rowdy Brand Store) ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ, ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి ప్రత్యేకంగా బ్రాండ్‌కు చెందిన దుస్తులు, పిల్లల కోసం బర్గర్లను గిఫ్ట్‌గా పంపారు. ఈ చిన్న సర్ప్రైజ్‌ బన్నీ మనసును గెలుచుకుంది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ గిఫ్ట్ ఫొటోను షేర్ చేస్తూ, "మై స్వీట్‌ బ్రదర్‌.. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఆశ్చర్యపరుస్తూ ఉంటావు. సో స్వీట్‌!" అంటూ అల్లు అర్జున్‌ హృదయపూర్వకంగా స్పందించాడు.

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

ఇది తొలిసారి కాదు ‘పుష్ప 2’ విడుదల సమయంలో కూడా విజయ్‌ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘పుష్ప’ టీషర్ట్‌లు బన్నీకి పంపిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా అల్లు అర్జున్‌ ఆనందంతో, ‘‘నా స్వీట్‌ బ్రదర్‌.. నీ ప్రేమకు ధన్యవాదాలు’’ అంటూ అభినందించాడు. దీనికి విజయ్‌ దేవరకొండ ‘‘లవ్ యూ అన్నా.. మన స్నేహం ఇలానే కొనసాగుతుంది’’ అని రిప్లై ఇచ్చాడు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందనున్న భారీ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు విజయ్‌ దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు, దీనిని గౌతమ్‌ తిన్ననూరి డైరెక్ట్‌ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment