Crime News: భార్యను హత్య చేసి పరారయ్యాడు.. నిందితుడిపై రూ.2 కోట్ల రివార్డ్ అమెరికాలో తొమ్మిదేళ్ల క్రితం భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. దీంతో నిందితుడిపై.. ఎఫ్‌బీఐ (FBI) తాజాగా భారీ రివార్డును ప్రకటించింది. అతడి ఆచూకి చెప్పినవారికి 2,50,000 డాలర్లు (రూ.2.1కోట్లు) ఇస్తామని వెల్లడించింది. By B Aravind 13 Apr 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలో తొమ్మిదేళ్ల క్రితం.. భారత్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ నిందితుడి ఆచూకి తెలియలేదు. దీంతో తాజాగా ఎఫ్‌బీఐ (FBI) అతడి తలపై భారీ రివార్డును ప్రకటించింది. నిందితుడి ఆచూకి చెప్పినవారికి 2,50,000 డాలర్లు (రూ.2.1కోట్లు) ఇస్తామని వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో భద్రేశ్ పటెల్, అతడి భార్య పాలక్ ఉండేవారు. ఈ దంపతులు స్థానికంగా ఉండే ఓ డోనట్ షాప్‌లో పనిచేసేవారు. అయితే 2015 ఏప్రిల్ 12న తన భార్యను కత్తితో పొడిచి చంపేసి పారిపోయాడు. Also Read: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఏళ్లనాటి శత్రుత్వం.. ఇప్పుడేం జరగనుంది? హత్య జరిగిన రోజు ఈ దంపతులు నైట్ షిఫ్ట్‌లో ఉన్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఆ కిచెన్‌లో పనిచేస్తున్న పాలక్ దగ్గరకు వెళ్లి కత్తితో పలుమార్లు పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన పాలక్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎఫ్‌బీఐ అధికారులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే హత్య జరిగిన తర్వాత భద్రదేశ్ తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి కొన్ని వస్తువులు తీసుకొని న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత అతడి జాడ కనిపించలేదు. ఆ రోజు నుంచి ఎఫ్‌బీఐ అతడిని గాలిస్తూనే ఉంది. 2017లో అతడిని టాప్‌టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఇప్పటికీ అతని ఆచూకి తెలియకపోవడంతో తాజాగా రివార్డు ప్రకటించింది. అయితే వీసా గడువు పూర్తవడంతో.. పాలక్ ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలనుకుందని.. భర్తకు ఇది నచ్చకపోవడంతోనే ఆమెను హత్య చేసి ఉంటాడని దర్యాప్తు అధికారుల విచారణలో బయటపడింది. నిందితుడు భద్రేశ్ కెనడాకు లేదా భారత్‌కు వెళ్లిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. Also Read: బస్సులో నుంచి 9 మంది కిడ్నాప్ చేసి చంపేసిన ఉగ్రవాదులు #telugu-news #crime-news #usa #america #fbi #wife-killed మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి