Constipation: నిద్రించే ముందు గ్లాసు పాలలో ఇది వేసుకుంటే మలబద్ధకం మాయం మలబద్ధకం కారణంగా కడుపు ఎప్పుడూ బరువుగా ఉండటమే కాకుండా తిమ్మిరి, భరించలేని నొప్పి వస్తుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగపోవడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో బాదంనూనెను కలిపి తాగితే మలబద్ధకం తగ్గుతుంది. By Vijaya Nimma 28 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Constipation: చాలా మందికి మలబద్ధకం సమస్య ఉంటుంది. మలబద్ధకం కారణంగా కడుపు ఎప్పుడూ బరువుగా ఉండటమే కాకుండా తిమ్మిరి, భరించలేని నొప్పి కూడా వస్తుంది. అంతే కాకుండా సమస్య పెరిగితే పైల్స్ లాంటి ప్రాణాంతక వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం, తగినంత నీరు తాగపోవడం జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది మలం విసర్జించడంలో ఇబ్బందికి దారితీస్తుంది. ఓ చిట్కాను ఉపయోగించి మలబద్ధకాన్ని తరిమికొట్టవచ్చు. మలబద్ధకం నుంచి ఉపశమనం ఎలా..? చెడు ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. దీనివల్ల చాలా రోజుల పాటు కడుపు సరిగా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల పేగులలో పేరుకుపోయిన మలాన్ని క్లియర్ చేసుకోవచ్చని అంటున్నారు. అందులో బాదం నూనె బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. బాదం నూనె ఎలా తాగాలి..? రాత్రి పడుకునే ముందు 4 నుంచి 5 చుక్కల బాదం నూనెను ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల పేగుల్లో పేరుకుపోయిన మలాన్ని క్లియర్ చేయడంలో మంచి ప్రభావం చూపుతుందని అనేక ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. నిజానికి బాదం నూనెలో భేదిమందు లక్షణాలు ఉన్నాయి. ఇది పేరు నరాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా పేగుల్లో కదలికలను ప్రోత్సహిస్తుంది. బాదం నూనె ప్రోబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. ఎవరు వాడకూడదు..? మీరు లాక్టోస్ అసహనంతో ఉంటే.. అంటే మీకు పాలు లేదా పాల ఉత్పత్తులను జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో బాదం నూనెను కలిపి తాగవచ్చు. ఈ పద్ధతి మలబద్ధకంపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇలా క్రమం తప్పకుండా రెమెడీని పాటిస్తే కొన్ని రోజుల్లో మలబద్ధకం నుంచి పూర్తి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: కాశీలోనే చనిపోవాలని ప్రజలు ఎందుకు కోరుకుంటారు..? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #milk #constipation #almond-oil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి