USA: బహిరంగ ప్రచారానికి ట్రంప్ దూరం? ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. By Manogna alamuru 24 Jul 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Donald Trump: మరో కొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడ రాజకీయాల్లో విపరీత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రచారంలో ఉన్న ట్రంప్ మీద హ్యాయత్నం జరిగింది. బైడెన్ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకున్నారు. కమలా హారిస్ పోటీలో ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ బహిరంగ ప్రచారానికి స్వస్తి చెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. తన మీద జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అలా మరోకసారి జరగకూడదని ట్రంప్ భావిస్తున్నారుట. అందుకే ఇక మీదట బహిరంగ ప్రచారంలో పాల్గొనకూడదని నిర్యం తీసుకున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి ట్రంప్ అయితే విరామ లేకుండా ప్రచారాలను నిర్వహిస్తున్నారు. కానీ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు భద్రత కల్పించాలని ట్రంప్ సీక్రెట్ సర్వీస్‌ను కోరారు. ానీ వారు అందుకు నిరాకరించారని తెలుస్తోంది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా ప్రచారాన్ని ఇండోర్ ప్రదేశాలకే పరిమితం చేయాలని ట్రంప్, రిపబ్లికన్ పార్టీ అనుకుంటోందని సమాచారం. ఒకవేళ బహిరంగ ప్రచారానికి వచ్చినా..ప్రజల రాకపోకలను స్ట్రిక్ట్ చేసే వీలున్న చిన్నపాటి స్టేడియాల్లోనే ప్రచారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ట్రంప్‌పై హత్యాయత్న ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తూ ఆ దేశ సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాజీ అధ్యక్షునికి భద్రత కల్పించడంలో జరిగిన వైఫల్యానికి బాధ్యత వహిస్తున్నానని, భారమైన హృదయంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. Also Read:Paris Olympics: రేపటి నుంచి పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ షెడ్యూల్ ఇదే #elections #usa #america #donald-trump #campagin మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి