IPL-2024 : విశాఖవాసుల కల నెరవేరింది.. మ్యాచ్ ఓడిపోయినా.. ధోనీ మెరిసాడు

విశాఖ వాసుల ఎదురు చూపులు ఫలించాయి. నిన్నటి మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేయడమే కాక ఉన్న కాసేపూ ధనాధన్‌లాడించి మరీ వెళ్ళాడు. దీంతో మ్యాచ్ ఓడిపోయినా...ధోనీ బ్యాటింగ్‌తో సంతృప్తి పడ్డారు ఫ్యాన్స్.

New Update
IPL-2024 : విశాఖవాసుల కల నెరవేరింది.. మ్యాచ్ ఓడిపోయినా.. ధోనీ మెరిసాడు

Chennai vs Delhi Match : నిన్న వైజాగ్‌(Vizag) లో జరిగిన చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచింది. ఐపీఎల్‌ 2024(IPL 2024) లో ఢిల్లీకి ఇది మొదటి విజయం కాగా చెన్నై సూపర్ కింగ్స్ తన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. అయితే చెన్నై మ్యాచ్ ఓడిపోయినప్పటికీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు. దానికి కారణం ధోనీ(Dhoni). ఇంతకు ముందు ఆడిన రెండు ఐపీఎల్ మ్యాచ్‌లలో ధోనీ బ్యాటింగ్‌కు దిగలేదు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే కాక..ఉన్నంతసేపూ షాట్లు కొడుతూ అలరించాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు.

చితక్కొట్టిన ధోనీ..

ధోనీ బ్యాటింగ్ చూసి టీవీల్లో చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఫ్యాన్‌తో పాటూ వైజాగ్ క్రికెట్ అభిమానులుకూడా పండుగ చేసుకున్నారు. ధోనీ బౌండరీ కొట్టినప్పుడల్లా స్టేడియం దద్ధరిల్లింది. ఢిల్లీ క్యాపిటల్స్(DC) అహ్మద్, నోకియాలను ఆటాడుకున్నాడు. నోకియా వేసిన చివరి ఓవర్లో రెండేసి సిక్సర్లు, ఫోర్లు కొట్టాడు. సిక్సర్‌తోనే ఇన్నింగ్స్‌ ముగించాడు. ధోని జోరు చూశాక.. అతను ఒక ఓవర్‌ ముందే బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే సీఎస్కే గెలిచేదేమో అని అంటున్నారు ఫ్యాన్స్. ఏదైతేనేం వైజాగ్ వాసుల కోరికను మాత్రం ధోనీ తీర్చాడు. దేని కోసం వాళ్ళు 18ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారో ఆ కలను నెరవేర్చాడు మిస్టర్ కూల్.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

ఫస్ట్ మ్యాచ్ గెలిచిన ఢిల్లీ..

ఇక నిన్నటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచి బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీద ఢిల్లీ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడిపోయింది.

Also Read : PM Modi : ఎలక్టోరల్ బాండ్లు ఎదురు దెబ్బ ఎలా అవుతుంది-ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

VIRAL VIDEO: బెంగళూరులో సినిమా రేంజ్ లో రోడ్డు ప్రమాదం.. చూస్తే షాక్ అవుతారు!

బెంగళూరులో పట్టపగలే సినిమా రేంజ్‌ రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్‌ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.

New Update
bengalore

bengalore

బెంగళూరు నగరంలో పట్టపగలే సినిమా రేంజ్‌ రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అతి వేగంలో ఉన్న వాటర్ ట్యాంకర్‌ మరో వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అదుపు తప్పింది. దీంతో నడి రోడ్డు పై మూడు పల్టీలు కొట్టింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Also Read: Ram Mandir: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

వివరాల ప్రకారం..వాటర్‌ ట్యాంకర్‌ వర్తూర్‌ వైపు నుంచి దొమ్మసాంద్రకు నీటిని తీసుకుని వెళ్తోంది.ఈ క్రమంలో సదరు వాటర్ ట్యాంకర్‌ డ్రైవర్‌ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్‌ టేక్‌ చేశాడు. ఒక్కసారిగా వేగం పెరగడంతో ట్యాంకర్‌ వాహనం అదుపు తప్పింది.

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

దీంతో వాహనం ప్రమాదానికి గురైంది. సినిమా రేంజ్‌ లో పల్టీలు కొడుతూ..రోడ్డు పై పడిపోయింది.  ట్యాంకర్‌ లో ఉన్న నీళ్లు ఎగిరిపడ్డాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఇక ఈ ప్రమాదం కారణంగా ట్యాంకర్‌ డ్రైవర్‌, వాహనంలో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రోడ్డు పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Also Read: TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 18 వేల ఉద్యోగాలు.. ఈ నెలలోనే నోటిఫికేషన్!

Also Read: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే వారికి అలర్ట్.. ఆ 6 ప్లాట్ ప్లాట్‌ఫామ్‌లు మూసివేత!

bengalore | latest-news | latest-telugu-news | latest telugu news updates | Water Tanker Crash | national-news | national news in Telugu | telugu-news-national-news 

Advertisment
Advertisment
Advertisment