NTR's Devara Movie: పక్కా ప్లాన్ తో వస్తున్న ఎన్టీయార్ దేవర

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారుమూవీ మేకర్స్. 2024 ఏప్రిల్ 5 దేవర మూవీని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు.

New Update
NTR's Devara Movie: పక్కా ప్లాన్ తో వస్తున్న ఎన్టీయార్ దేవర

Devara Movie: 2024 ఏడాది మూవీ ప్రియులకు పండుగ. పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నీ ఈ ఇయర్ లోనే విడుదల అవుతున్నాయి. ఇందులో మొదటిసారి తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీయార్ (NTR) కూడా ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొరటాల శివ (Koratala Siva), ఎన్టీయార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా దేవర కూడా వచ్చే ఏడాదిని రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 5న దేవర (Devara) మూవీని రిలీజ్ చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం సినిమా రిలీజ్ డేట్ ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 5, 6,7 వీకెండ్స్ పడింది. తర్వాత ఏప్రిల్ 9న ఉగాది, 11న ఈద్ ఫెస్టివల్, 14న అంబేద్కర్ జయంతి, 17న శ్రీరామ నవమి, 18 నుంచి మళ్ళీ మూడు రోజుల పాటు వీకెండ్ వచ్చాయి. దీంతో మొత్తం పదహారు రోజులు ఫుల్ గా సెలవులు ఉన్నాయి. ఇది దేవర మూవీకి బాగా కలిసి వస్తుంది. మధ్యలో ఒకటి, రెండు వర్కింగ్ డేస్ మాత్రమే ఉన్నాయి.

ఇప్పటికే దేవర సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించిన వాటిలో ఆచార్య తప్ప అన్ని సినిమాలు హిట్ అయినవే. అలాగే ఇంతకు ముందు ఎన్టీయార్ తో కొరటాల తీసిన జనతా గ్యారేజ్ కూడా పెద్ద హిట్ అయింది. అందుకే ఇప్పుడు దేవర సినిమా మీద కూడా అంచనాలు చాలా ఉన్నాయి. దానికి తోడు ఈసారి దర్శకుడు తీసుకున్న కథ , ఎన్టీయార్ గెటప్ కొత్తగా ఉన్నాయి. ఈ మూవీలో ఎన్టీయార్ సముద్రవీరుడిగా కనిపిస్తున్నారు. ఇవి సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ (Janhvi Kapoor) మొదటిసారి తెలుగులో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కూడా విలన్ గా నటిస్తున్నారు. వీటన్నిటితో పాటూ దేవర సినిమా రిలీజ్ లోపు కొరటాలశివ, ఎన్టీయార్ పాజిటివ్ టాక్ ని కూడా రాబడితే బాక్సాఫీస్ కలెక్షన్లు రావడం ఖాయం.

Also Read: ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ వాయిదా…హమ్మయ్య ఇప్పటికైనా చెప్పారు

Advertisment
Advertisment
Advertisment