Stock Market News: నిన్నటి లాభాలు ఎగిరిపోయాయి.. నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు కొత్త ఆర్ధిక సంవత్సం బాగా మొదలైంది..స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి అనుకున్నారు. అయితే అదంతా ఒక్కరోజు ముచ్చటగానే సాగింది. ఈరోజు మళ్ళీ దేశీ మార్కెట్ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. By Manogna alamuru 02 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Market Today: నిన్న లాభాలతో పరుగులుతీసిన దేశీ మార్కెట్లు ఇవాళ డీలా పడిపోయాయి. ఉదయం ప్రారంభం దగ్గర నుంచే స్టాక్ మార్కెట్ సూచీలు దిగువ చూపు చూస్తున్నాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ (Sensex) 145 పాయింట్లు నష్టపోయి 73,868 దగ్గర ఉండగా..నిఫ్టీ (Nifty) 24 పాయింట్లు కుంగి 22,437 దగ్గర ట్రేదవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.37 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు...ఇక్కడ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. అమెరికా మార్కెట్లు నిన్న నష్టాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు స్వల్ప లాబాల్లో ఉన్నప్పటికీ వాటి ప్రబావం దేవీ సూచీల మీద అంతగా కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ చమురు ధర 87.83 డాలర్ల వద్ద ఉంది. విదేశీ సంస్థాగత మదుపర్లు సోమవారం నికరంగా రూ.522.30 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ‘దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.1,208.42 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు. ఇక సెన్సెక్స్‌లో ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, నెస్లే ఇండియా, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, టైటన్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా..ఐసీఐసీఐ బ్యాంక్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్లలో ఊగిసలాటలు దేశ ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపించడం లేదు. తాజా గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థలో బలాన్ని సూచిస్తున్నాయి. 2024 మార్చి నెలలో GST వసూళ్లు 11.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు, 2023 ఏప్రిల్‌లో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి. Also Read:Hyderabad: హైదరాబాద్‌లో భారీగా చలాన్లు..40 రోజుల్లో 51.45 లక్షలు #stock-market-today #shares #stock-markets #share-market-today మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి