/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-53-jpg.webp)
annamaiah crime news
AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది. వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు.
ప్రాణం తీసిన ఈత..
ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్ (6), వెంకటేష్ కుమారుడు యశ్వంత్ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు.
ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు
సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్ ప్లేసులు ఇవే
( ap-crime-news | ap crime latest updates | latest-news )
ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు: పురంధేశ్వరి!
బీజేపీ ఏపీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు.
Daggubati Purandeswari Comments on YCP : బీజేపీ ఏపీ చీఫ్ (AP BJP Chief) గా బాధ్యతలు స్వీకరించిన తరువాత పురంధేశ్వరి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఏపీ పాలన ప్రభుత్వం పై నిత్యం ఏదోక రూపంలో విరుచుకుపడుతున్నారు. తాజాగా ఆమె మరికొన్ని ట్విట్టస్త్రాలు సంధించారు.
అందులో ఆమె ఏపీ సర్పంచుల గురించి ప్రస్తావించారు. ఏపీలో నేడు సర్పంచులు అంతా కూడా ఉత్సవ విగ్రహాలుగా మారారని ఆమె పేర్కొన్నారు. కేంద్రం పంచాయతీలకిచ్చిన నిధులను ఏపీ గవర్నమెంట్ పక్క దారి పట్టిస్తుంది. గ్రామాల అభివృద్ధికి నేడు ప్రభుత్వం తిలోదకాలు వదిలి పెట్టింది.
సుమారు నాలుగున్నరేళ్ల కాలంలో కేంద్రం రూ.8600 కోట్లు ఏపీలోని గ్రామాలకు ఇచ్చింది. కానీ సర్పంచులు అప్పులు చేసి మరి గ్రామాల అభివృద్దికి పునుకున్నారు. కానీ బిల్లులు రావడం లేదు. దీంతో కొందరు సర్పంచులు ఆ అప్పులు కట్టలేక..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కేంద్ర నిధుల వాటాతో జరిగే అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా కనీసం బిల్లులు మంజూరు చేయడం లేదు. కావాలనే వాటిని ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటొంది. ఏపీ ప్రభుత్వానికి భజన చేస్తూ..వారికి ముడుపులు సమర్పించుకుంటున్నవారికి గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు.
వీటికి అన్నింటికి ఏదోక నాడు ఏపీ ప్రభుత్వం కచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుంది. ఈ నెల పదో తేదీన అన్ని జిల్లాల్లోని సర్పంచులకు అండగా కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతాం అని ఆమె ట్విట్లర్ లో పోస్ట్ చేశారు.
టీటీడీ ఛైర్మన్
ఇది ఇలా ఉంటే..పురంధేశ్వరి టీటీడీ ఛైర్మన్ పదవి గురించి కూడా ప్రస్తావించారు. హిందూ ధర్మం పై పూర్తిగా నమ్మకం ఉన్న వారినే టీటీడీ ఛైర్మన్ (TTD Chairman) గా నియమించాలని ఆమె పేర్కొన్నారు. అదేసమయంలో ఈ పదవి ఒక రాజకీయ పునరావాస పదవి కారాదన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఆ పదవికి న్యాయం చేయగలరని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆమె మంగళవారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం సోమవారంతో ముగిసింది. కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఈయన టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. గతంలో సీఎంగా వైఎస్ఆర్ ఉన్న సమయంలో కూడా ఆయన ఒకసారి టీటీడీ ఛైర్మన్‌గా పని చేశారు
అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి శ్రీవేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక నల్లరాయితో పోల్చారు. అప్పట్లో ఈ విషయం పెద్ద వివాదమైంది. ఇపుడు ఆయన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించడాన్ని అనేక హిందూవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేస్తూ, "ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేపట్టింది.
దానిపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపివేశారు. ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాసంగానే పరిగణిస్తోందని అర్థమవుతోంది. టీటీడీ ఛైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవారిని.. ఆ ధర్మాన్ని అనుసరించేవారినే నియమించాలి. అన్య మతస్తులను కాదు" అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.
Also Read: నేడు వైఎస్సాఆర్ షాదీ తోఫా, కళ్యాణమస్తు నిధుల విడుదల!
AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్ (6), విజయ్ (6), యశ్వంత్ (7) లు ప్రాణాలు కోల్పోయారు. క్రైం | Short News | Latest News In Telugu | కడప | ఆంధ్రప్రదేశ్
ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈజీగా తెలుసుకోండి
వాట్సాప్‌లో 9552300009కు హాయ్ అని మెసేజ్ చేస్తే మీ రిజల్ట్స్ వస్తాయని లోకేష్ తెలిపారు. Short News | Latest News In Telugu | జాబ్స్ | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Ap Govt: నేడు వారికి సెలవు రద్దూ..ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండో శనివారం కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
AP: గోరంట్ల మాధవ్ కు ఏప్రిల్ 24 వరకు రిమాండ్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఇతనితో పాటూ మిగతా ఐదుగురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది. Short News | Latest News In Telugu | టాప్ స్టోరీస్ | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
🔴Live News Updates: ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరణ: సీఎం రేవంత్
Stay updated with the Latest News In Telugu! Get breaking news, politics క్రైం | టెక్నాలజీ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
కొండెక్కుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే?
JAAT Collections: 'జాట్' డే 1 ఎంతంటే..?
Maoist: మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 22 మంది కీలక కమాండర్లు!
US Dollar: డాలర్ పడిపోతోంది..రూపాయి పెరుగుతోంది..ఏమవుతోంది అమెరికా ఆర్థిక వ్యవస్థకు?
🔴Live News Updates: ఒకేరోజు వందల మందికి గూగుల్ లేఆఫ్..!