/rtv/media/media_files/2025/02/17/haqRSrQD0Hb3EJxKFKSl.jpg)
TG Crime
ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న చిన్న కారణాలకు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్షణికావేశంతో అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు ఇలా జరగదు. కానీ కోపం, బాధ ఇలా ఏదో ఒక కారణంతో కొంచెం కూడా ఆలోచించరు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే అడిగిన వస్తువు భర్త కొనివ్వలేదని, చీర కొనివ్వలేదని, సీరియస్ అయ్యారని లేకపోతే తిట్టారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏపీలోని అనకాపల్లిలో కూడా ఇటీవల ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!
భర్త షికారుకు తీసుకెళ్లలేదని మనస్తాపంతో..
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి పట్టణంలో అీబ్దుల్ గని, మంగరాపు జ్యోతి ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని 2023లో వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ దంపతులకు ఏడు నెలల కొడుకు కూడా ఉన్నాడు. అయితే భార్య, కుమారుడిని చూడటానికి భర్త అనకాపల్లి వెళ్లాడు. ఈ సమయంలో భార్య తనని బయటకు తీసుకెళ్లమని అడిగింది. దీంతో తల్లి ఇలాంటి సమయాల్లో బయటకు ఎందుకని మందలించింది.
ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!
దీంతో ఆ భార్య మనోవేదనకు గురై వెంటనే ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. జ్యోతి అక్కడే చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచింది. తల్లి చనిపోవడంతో ఆ ఏడు నెలల పసికందు ఒంటరి అయ్యింది. జ్యోతి మృతితో ఆ గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అందుకే క్షణికావేశం పనికిరాదని అంటుంటారు.
ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు