/rtv/media/media_files/2025/11/26/practicing-basketball-2025-11-26-16-47-53.jpg)
ఓ యువ బాస్కెట్ బాల్ ప్లేయర్‌ని దురదృష్టం వెంటాడింది. దీంతో ప్రాక్టీస్‌లో అతని ప్రాణాలు కోల్పోయాడు. ప్రాక్టీస్ చేస్తుండగా బాస్కెట్ బాల్ పోల్ విరిగి జాతీయ స్థాయి క్రీడాకారుడిపై పడింది. ఆ క్రీడాకారుడు మరణించాడు. సీసీటీవీలో రికార్డైన ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అయ్యింది. హర్యానాలోని రోహ్‌తక్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 25న లఖన్ మజ్రా గ్రామంలోని స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారుడైన హార్దిక్ రతి(16) ప్రాక్టీస్ చేశాడు. బాల్ లేకుండా బాస్కెట్ వేస్తున్నట్లు రింగ్‌ని చేతితో పట్టుకొని వేలాడాడు. అయితే బాస్కెట్ బాల్ పోల్ విరిగి అతడిపై పడింది. గమనించిన మిగతా క్రీడాకారులు పరుగున హార్దిక్ వద్దకు చేరుకున్నారు. ఛాతిపై ఆ పోల్ బరువంతా పడి తీవ్రగాయమైంది. అతడ్ని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. స్పోర్ట్స్ గ్రౌండ్‌లోని సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read : తల్లి చేసిన పాపానికి 6ఏళ్లు జైలులో పసిపాప.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
National Player Died While Practicing Basketball In Haryana
हरियाणा के रोहतक में एक होनहार खिलाड़ी प्रशासन की लापरवाही का शिकार हो गया।
— Jitender Sharma (@capt_ivane) November 26, 2025
बास्केटबॉल की प्रैक्टिस कर रहे खिलाड़ी पर पोल जा गिरा और उसकी मौत हो गयी। #Rohtak#NationalPlayer@cmohry@DC_Rohtak@mansukhmandviya@YASMinistrypic.twitter.com/LnXfk9TO8j
జాతీయ స్థాయి క్రీడాకారుడైన హార్దిక్ రతి, కాంగ్రాలో జరిగిన 47వ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్, హైదరాబాద్‌లో జరిగిన 49వ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్, పుదుచ్చేరిలో జరిగిన 39వ యూత్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌తో సహా అనేక జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్టొన్నాడు. పలు మెడల్స్ గెలుచుకున్నాడు. మరోవైపు రెండు రోజుల కిందట హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో హోషియార్ సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఇలాంటి సంఘటన జరిగింది. 15 ఏళ్ల క్రీడాకారుడు ప్రాక్టీస్ చేస్తుండగా బాస్కెట్‌బాల్ పోల్ విరుగటంతో అతడు గాయపడ్డాడు. రోహ్తక్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో క్రీడా మంత్రి గౌరవ్ గౌతమ్ స్పందించారు.
Also Read : ఐబొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. పైరసీ చేయలేదు సినిమాలు కొన్నాడు
Follow Us