/rtv/media/media_files/2026/02/08/three-dead-bodies-2026-02-08-19-42-38.jpg)
కారు డిక్కీలో మూడు డెడ్‌బాడీలు(Three dead bodies) బయటపడటం ఢిల్లీలో తీవ్ర కలకలం రేపింది. పీరాగఢీ ఫ్లైఓవర్ సమీపంలో పార్క్ చేసిన ఓ పాడుబడిన కారులో ముగ్గురు వ్యక్తులు మృతి చెంది ఉండటం స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫ్లైఓవర్ కింద చాలా కాలంగా నిలిపి ఉంచిన పాత కారు నుండి దుర్వాసన రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కారు తలుపులు తెరిచి చూడగా లోపల ముగ్గురు వ్యక్తుల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ముగ్గురు వ్యక్తులు కొన్ని రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read : భారత్ దెబ్బకు ఇంకా రిపేర్లు చేయించుకుంటున్న పాకిస్తాన్
Three Dead Bodies Found In An Abandoned Car In Delhi
#WATCH | Visuals from the Peeragarhi flyover in outer Delhi, where three bodies were found in a car. According to Delhi Police, there are no visible signs of injury on the bodies, and preliminary investigation suggests it is a case of suicide.
— ANI (@ANI) February 8, 2026
DCP Outer District Sachin Sharma… pic.twitter.com/XcgJXpFrKb
Also Read : పాకిస్థానీ ఏజెంట్‌తో సంబంధాలు.. అస్సాం CM సంచలన వ్యాఖ్యలు
ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాలను పిలిపించి, కారు లోపల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. ఇది ఊపిరి ఆడక జరిగిన ప్రమాదమా లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాలను కారులో పడేశారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాలపై ఎటువంటి గాయాలు ఉన్నాయనేది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే తెలుస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సిసిటివి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ పాడుబడిన కారు ఎవరిది? అది అక్కడ ఎంతకాలంగా ఉంది? ఆ ముగ్గురు వ్యక్తులు కారులోకి ఎలా వెళ్లారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. రద్దీగా ఉండే ఫ్లైఓవర్ సమీపంలో ఇలా మూడు మృతదేహాలు బయటపడటం ఢిల్లీ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. పాడుబడిన వాహనాలు నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయని, పోలీసులు అటువంటి వాహనాలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో మిస్సింగ్ కేసుల డేటాను కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. త్వరలోనే మృతుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Follow Us