Bihar: గురుదక్షిణగా..గర్ల్ ఫ్రెండ్ గా ఉండు...విద్యార్థినికి టీచర్ వేధింపులు

ఈ మధ్య టీచర్లు దారుణంగా తయారవుతున్నారు. చాలాచోట్ల విద్యార్థులను వేధిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీహార్ లో ఓ టీచర్...విద్యార్థిని వెంటపడ్డాడు. గురుదక్షిణగా ఆమెను గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటూ వేధించాడు. 

New Update
bihar

Bihar Teacher at a school asked a girl student to become his girlfriend

Bihar: తల్లీతండ్రీ తర్వాత టీచరే దైవం అంటారు. పిల్లలకు విద్య నేర్పించే గురువు మంచి బుద్ధులతో ఉండాలి. సత్ప్రవర్తనతో ఉంటూ పిల్లలకు అదే నేర్పించాలి. కానీ ఈ కాలంలో టీచర్లు కిరాతకంగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు. అసలే ఆడపిల్లలు బతకడం కష్టం అవుతుంటే...ఇప్పుడు టీచర్లు కూడా ఇలా తయారవడం తో పిల్లల తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. 

Also Read :  వల్లభనేని వంశీ అరెస్ట్‌..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

ఏకలవ్యుడి కథతో ప్రపోజల్..

తాజాగా బీహార్ లోని కిసాన్ గంజ్ జిల్లాలో ఉన్న హైస్కూల్లో పని చేస్తున్న కీచక టీచర్ వికాస్ కుమార్...అదే స్కూల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థిని వెంట పడ్డాడు.  ఆమె ఫోన్ నంబర్ తీసుకుని రోజూ ఫోన్ చేస్తూ వేధించాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలంటూ తినేశాడు. పైగా దానికి మహాభారతం నుంచి ఏకలవ్యుడి కథను ఉదాహరణగా చెప్పాడు కూడా. గురుదక్షిణ కింద తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని కోరాడు. ఈ క్రమంలోనే ఆ విద్యార్థినికి వికాస్ కుమార్ పలుమార్లు ప్రపోజ్ చేశాడు. ఇద్దరం కలిసి సిలిగురికి వెళ్లి.. ఎంజాయ్‌ చేద్దామని చెప్పాడు.

Also Read :  RCB vs GG :  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం

ఈ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. స్కూల్ యాజమాన్యానికి కూడా కంప్లైంట్ ఇచ్చింది. ప్రిన్సిపల్ ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అయితే ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వికాస్ కుమార్ మీద ఎటువంటి చర్యా తీసుకోలేదు. దీంతో ఈ విషయం కాస్తా గ్రామస్తుల వరకూ వెళ్ళింది.  వారు ఆగ్రహంతో స్కూల్ దగ్గర ధర్నా చేశారు. దాంతో పోలీసులు అక్కడకు వచ్చారు. విషయం జిల్లా కలెక్టర్ వరకూ వెళ్ళింది. ఆయన వచ్చి వికాస్ కుమార్ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు శాంతించారు. అయితే వికాస్ కుమార్ గతంలో అదే స్కూల్‌లో పని చేసిన మహిళా టీచర్‌కు ప్రపోజ్‌ చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. 

Also Read:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!


 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rape case: మైనర్ బాలికను రేప్ చేసిన బ్యాడ్మింటన్ కోచ్.. ఫోన్‌లో ట్రైనీల న్యూడ్ ఫొటోలు!

బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించిన పోలీసులు తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

New Update
rape case bg

Bengaluru Badminton coach sexually assaults minor girl

Rape case: బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై  బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించి పోలీసులు సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు. 

ట్రైనీల న్యూడ్ ఫొటోలు..

ఈ మేరకు తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్ లో బాడ్మింటన్ కోచ్ గా పనిచేస్తున్నాడు. అయితే 16 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం ట్రైనీగా చేరింది. ఆమెను బలవంతంగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో మరో 8మంది ట్రైనీల న్యూడ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బాలికతోపాటు మరికొంతమంది అమ్మాయిలను కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుండటం సంచలనం రేపుతోంది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

అయితే బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ తరచుగా బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బయటపడింది. కోచ్‌ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్‌ పిక్స్‌ను అతనికి పంపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను నిలదియగా అసలు విషయం బయటపెట్టింది. కానీ బాలిక మాత్రం కోచ్‌ సురేష్‌తో తానే అక్రమం సంబంధం పెట్టుకున్నట్లు చెప్పడంతో కేసు మరింత సంచలనంగా మారింది.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

bengalore | rape-case | minor-girl | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment