/rtv/media/media_files/2025/04/09/bjud2LYcWchEmijZH6l4.jpg)
Union Minister Grand Daughter Shot Dead
Union Minister Grand Daughter Shot Dead: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి (32) బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను తన భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామం అటారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న అటారీ పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందింతుడు రమేశ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also read: BIG BREAKING: ట్రంప్‌కు చైనా బిగ్ షాక్.. అమెరికాపై 84శాతం ప్రతీకార సుంకాలు
పోలీసుల కథనం ప్రకారం, మృతురాలు సుష్మా దేవి అటారీ బ్లాక్‌లో వికాస్ మిత్రాగా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆమెపై రమేశ్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఆమెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బంధించాడు. ఆ తర్వాత ఆమె ఛాతి భాగంలో కాల్చి పారిపోయాడు. దీంతో సుష్మా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మగధ్ ఆసుపత్రికి తరలించారు. 'సుష్మను ఆమె భర్తే కాల్చి చంపాడు. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాం. ఫోరెన్సిక్ టీమ్, టెక్నికల్ సెల్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నాం. నిందితుడిని వీలైనంత త్వరలోనే పట్టుకుంటాం' అని గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ మనుమరాలు 32 ఏళ్ల సుష్మా దేవి 14 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమించారు. అతడి పేరే రమేష్. వీరిద్దరూ గతంలోనే కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం బిహార్‌లోని గయా జిల్లా టెటువా గ్రామంలో ఉంటున్నారు. రమేష్ ఓ ట్రక్కు నడుపుతూ జీవనం సాగిస్తుండగా.. సుష్మాదేవి వికాస్ మిత్రగా పని చేస్తున్నారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. చాలా ఏళ్లుగా హాయిగా సాగుతున్న వీరి కాపురంలో ఇటీవలే గొడవలు ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.
Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
అయితే ఎప్పటిలాగే వీరిద్దరూ బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇంట్లోనే గొడవ పడ్డారు. అయితే అప్పుడు ఇంట్లో వీరి పిల్లలతో పాటు సుష్మాదేవి సోదరి కూడా ఉంది. కానీ భార్యాభర్తలు ఇద్దరు ఓ గదిలో ఉండగా.. వారంతా మరో గదిలో ఉన్నారు. ఏ విషయం గురించి వీరు గొడవ పడ్డారో తెలియదు కానీ రమేష్ ఒక్కసారిగా తుపాకీ తీసుకుని సుష్మాదేవిపై కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో రమేష్ సంఘటనా స్థలం నుంచి పారిపోయాడు. తుపాకీ చప్పుడు వినిపించగా.. పిల్లలు, సోదరి సహా స్థానిక ప్రజలంతా అక్కడకు వచ్చారు. అయితే అప్పటికే సుష్మా దేవి ప్రాణాలు కోల్పోయి రక్తపు మడుగులో పడి ఉంది.
Also read : Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పక్కనే దేశీయ పిస్తోల్ దొరికింది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. సుష్మా దేవి భర్త రమేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కేంద్రమంత్రి మనవరాలు కావడం, అదికూడా ఇంట్లో భర్త చేతిలోనే హత్యకు గురికావడంతో పోలీసులు కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈక్రమంలోనే నీమ్‌చక్ బథాని ఎస్డీపీఓ ప్రకాష్ కుమార్, ఎస్ఎస్పీ అన్వర్ జావేద్ అన్సారీ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాట్లు చేసినట్లు గయా ఎస్ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.
Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
Also Read : ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!
Manav Sharma: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్
భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు అతను మాట్లాడిన 6 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మానవ్ ఆరోపణలపై అతని భార్య నికిత శర్మ ఖండించింది.
భార్య పెట్టే టార్చర్ తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు ముందు అతను మాట్లాడిన 6 నిమిషాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ గా మారింది. 35 ఏళ్ల మానవ్ శర్మ టీసీఎస్ కంపెనీలో రిక్రూట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేసేవాడు. అతనికి నికితా శర్మ అనే అమ్మాయితో 2024 జనవరి 30వ తేదీన పెళ్లైంది. అయితే తన భార్య తనను చాలా టార్చర్ పెడుతుందని.. అది తట్టుకోలేక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని.. ఆమె ప్రవర్తనపై కూడా తనకు అనుమానం వచ్చిందని వీడియోలో కన్నీళ్లతో చెప్పాడు.
Also Read : తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్
Also Read : స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఆ రోజు నుంచే ఏపీలో ఒంటిపూట బడులు
పెళ్లయినప్పటీ నుంచి ఎప్పుడు కూడా తనతో మంచిగా లేదని.. చాలా దురుసుగా ప్రవర్తించేదని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కూడా అత్మహత్య చేసుకునేందుకు తాను ప్రయత్నించానని కానీ తనకు తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో వెనక్కి తగ్గినట్లుగా వెల్లడించాడు. కానీ రోజురోజుకూ తన భార్య పెడుతున్న మానసిక క్షోభ (Wife Torcher) ను తట్టుకోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించాడు. ఈ వీడియోలో మానవ్ తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు కూడా చెప్పాడు. మమ్మీ, డాడీ, అక్కూ.. సారీ, ఇక నేను వెళ్లిపోతున్నా అని తెలిపాడు.
Also Read : సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్‌ను లీడర్‌గా నిలిపేందుకే "విజ్ఞాన్ వైభవ్'
మానవ్ గృహ హింసకు పాల్పడ్డాడు : నికిత
ఈ వీడియోలో తనతో పాటుగా ఈ సమాజంలో తనలాగా వేధింపులు ఎదుర్కొంటున్న మిగితా మగాళ్ల గురించి కూడా మాట్లాడాడు మానవ్ శర్మ. పురుషులకు కూడా ప్రత్యేకమైన చట్టాలు రావాలన్నాడు. ఎవరో ఒకరు మగవారి గురించి కూడా మాట్లాడాలని వెల్లడించాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మానవ్ ఆరోపణలపై అతని భార్య నికిత శర్మ ఖండించింది. మానవ్ గృహ హింసకు పాల్పడ్డాడని నికిత ఆరోపించింది. మానవ్ తాగొచ్చి తనను కొట్టేవాడంది. అతని కుటుంబ సభ్యులు కూడా తనతో అనుచితంగా ప్రవర్తించి నన్ను ఇంటి నుండి గెంటేశారని నికిత వాపోయింది. ఈ ఘటనపై మానవ్ శర్మ తండ్రి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. తన కోడలు, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి తన కొడుకును తీవ్రంగా బెదిరించినట్లుగా ఫిర్యాదులో తెలిపాడు. దీంతో మానవ్ శర్మ తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించాడు.
Also read : cabinet meeting : మార్చి 6న తెలంగాణ మంత్రివర్గ సమావేశం
Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ మనవరాలు సుష్మా దేవి బుధవారం హత్యకు గురయ్యారు. ఆమెను భర్త రమేశ్ సింగ్ కాల్చి చంపాడు. : క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
ములుగు జిల్లా వాజేడు మండలంలో గిరిజన యువకుడి హత్య కలకలం సృష్టించింది. ఈ హత్య గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది.క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
Viral video: రన్నింగ్ ట్రైన్ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్
కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | వైరల్
AP Murder: ఏపీలో యువకుడి దారుణ హత్య.. అడ్డుకున్న స్నేహితుడి గుండెల్లో పొడిచి!
ఏపీలో మరో దారుణ మర్డర్ జరిగింది. నర్సీపట్నం తలుపులమ్మ తల్లి జాతరలో మహేష్, దుర్గా ప్రసాద్. క్రైం | Short News | Latest News In Telugu | గుంటూరు | ఆంధ్రప్రదేశ్
Crime story: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!
తల్లిదండ్రుల క్షణికావేశానికి పసిబిడ్డలు బలవుతున్నారు. ముఖ్యంగా అక్రమ సంబంధాల మోజులో. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
East Godavari : మాములు దొంగ కాదు.. కొట్టేసిన నగలను ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు!
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పందిరి వెంకటనారాయణను అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన నగలను క్రైం | Short News | Latest News In Telugu | తూర్పు గోదావరి
RR VS GT: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
ఏపీకి గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు
Union Minister Grand Daughter Shot Dead : బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య
Hit 3 Movie Second Song: అర్జున్ సర్కార్ కొత్త సాంగ్ ఊరమాస్.. ‘హిట్ 3’ సెకండ్ సింగిల్ కెవ్ కేక