Kumbh Mela Road Accident: కుంభమేళాకు వెళ్లి వస్తుండగా విషాదం.. ఆరుగురు మృతి

కుంభమేళా పుణ్య స్నానాలు ఆచరించి వస్తున్న భక్తులు యూపీలో రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా.. మరికొందరు గాయాలపాలైయ్యారు. నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కుస్మి కాలా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

New Update
up accident

Kumbh Mela Road Accident

Kumbh Mela Road Accident: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఘాజీపూర్‌(Ghazipur)లో ప్రయాగ్‌రాజ్(Prayagraj) మహా కుంభమేళా వెళ్లి వస్తున్న భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో చాలామంది గాయపడ్డారు. నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కుస్మి కాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 

Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?

వరుస విషాద ఘటనలు..

గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం ఘాజీపూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్, పోలీస్ ఆఫీసర్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. దీనికి రెండు రోజుల క్రితం కుంభమేళాలో తొక్కిసలాట చోటుచేసుకొని 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా వరుస విషాద ఘటనలు కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్న భక్తులను భయాందోళలకు గురిచేస్తున్నాయి. ప్రయాగ్ రాజ్ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లాలంటే జంకుతున్నారు. అయినా సరే రోజు కొన్ని కోట్ల మంది భక్తులు కుంభమేళా సందర్శించుకుంటున్నారు.  

Also Read: నేను కొడితే మాములుగా ఉండదు.. కాస్కో రేవంత్ : KCR

Also Read: Economic Survey: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?

Also Read: Business: ఈ టాప్ 5 షేర్ల మీద పెట్టుబడి పెడితే...లాభాలు మీ వెంటే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు