Ranya Rao: బంగారు కిలాడీ.. అతనికోసమే గల్ఫ్ దేశాలన్నీ చుట్టేసి గోల్డ్ రవాణా!

రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. రాజకీయ శక్తుల అండతోనే ఇదంతా చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తొడలకు గోల్డ్ స్టిక్కర్లు అంటించుకుని ఎయిర్‌పోర్ట్‌లో ఒక కానిస్టేబుల్ సహాయంతో బయటపడేదట.

New Update
 Ranya Rao

 Ranya Rao

Ranya Rao: నటి, రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. డీజీపీ రామచంద్రరావు కూతురు అయిన రన్యాను మార్చి 7 నుంచి 11 వరకు డీఆర్ఐ కస్టడీకి అప్పగిస్తూ ఆర్థిక నేరాల న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమెను అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్లు అంగీకరించిందని, ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర కూడా ఉన్నట్లు రన్యా బయటపెట్టినట్లు సమాచారం. ఇదంతా కూడా అతనికోసమే చేసినట్లు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. 

15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు..

ఈ మేరకు రన్యా బ్యాంక్ చెల్లింపులపై ఫోకస్ పెట్టిన అధికారులు ఆ రాజకీయ నేత ఎవరనేదానిపై ఆరాతీస్తున్నారు. యూఏఈ నుంచి రన్యారావు 17 బంగారు బిస్కెట్లను తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. దుబాయ్‌ మాత్రమే కాదు యూరప్‌, సౌదీ అరేబియా, అమెరికా, పశ్చిమాసియా దేశాల నుంచి కూడా ఆమె బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. 2024లోనే ఆమె 30 సార్లు దుబాయ్‌కు వెళ్లిందని, ఇటీవలే కేవలం 15 రోజుల్లో 4 సార్లు విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు. ప్రతి ట్రిప్‌లో కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు నిర్ధారించారు. స్మగ్లింగ్ చేసినందుకు ఒక ట్రిప్ కు రూ.12 లక్షలు తీసుకుంటుందని తెలిపారు. అయితే ఈ విషయాలను రహస్యంగా ఉంచాలని రన్యా అధికారులను కోరుతోందట. తనకు కొంత రెస్ట్ కావాలని, విచారణకు పిలిచన ప్రతిసారి వస్తానని చెబుతోందట. 

ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!

కానిస్టేబుల్ సాయంతో..

అలాగే ఈ స్మగ్లింగ్ లో రన్యా రావు భర్త భర్త, ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకునికుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రన్యా రావుతో కలిసి అతడు కూడా పలుమార్లు విదేశాలకు వెళ్లినట్లు తెలిపారు. తన తండ్రి హోదాను అడ్డం పెట్టుకుని ఒక కానిస్టేబుల్ సాయంతో ఎయిర్‌పోర్టుల్లో ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. బంగారం బిస్కెట్లు తొడలకు స్టిక్కర్లతో అంటించుకుని బయటకు వచ్చేసేదట. దీనివెనక బలమైన రాజకీయ శక్తుల సపోర్టుతోనే ఇదంతా చేసినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్‌ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..

Advertisment
Advertisment
Advertisment