Professor Harassment: ప్రొఫెసర్ కాదు కామాంధుడు... వీడియోలు తీసి కోరికలు తీర్చాలంటూ టార్చర్!

UP హత్రాస్‌లో ఓ ప్రొఫెసర్ స్టూడెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఏడాదిగా ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడు. విసిగిపోయిన ఓ మహిళ పోలీసులకు లెటర్ ద్వారా ఫిర్యాదు చేసింది. జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్‌‌ అరచకాలను వీడియో రూపంలో బయట పెట్టింది.

New Update
professor harassment

professor harassment Photograph: (professor harassment)

కాలేజీ ప్రొఫెసర్ కామాంధుడి అవతారం ఎత్తి ఎందరో విద్యార్థు జీవితాలతో ఆడుకున్నాడు. స్టూడెంట్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ తతంగం అంతా ఎన్నో ఏళ్లుగా సాగుతోంది. ప్రొఫెసర్ వేధింపులు  భరించలేక ధైర్యంగా బయట చెప్పలేక చాలా మంది యువతులు ఆవేదనకు గురైయ్యారు. ఓ బాధిత మహిళ పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. ఆ ప్రొఫెసర్‌ వికృత చేష్టలకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పంపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని హత్రాస్‌ (Hathras) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 

Also read: BIG BREAKING: యాంకర్ శ్యామల, రీతూ చౌదరిలపై కేసు నమోదు

Also Read :  నిరుద్యోగులకు రూ.3 లక్షలు.. రేవంత్ సర్కార్ పథకానికి ఇలా అప్లై చేసుకోండి!

Professor Sexually Harassed Students

హత్రాస్‌లోని సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీలోని జియాలజీ ప్రొఫెసర్ రజనీష్ కుమార్‌ పలువురు మహిళా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మార్చి 13న ప్రొఫెసర్ రజనీష్‌పై పోలీసులకు గుర్తు చిరునామా లేని లెటర్ ద్వారా ఫిర్యాదు అందింది. లేడీ స్టూడెంట్స్‌తో ఆ ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు వీడియోలు రికార్డ్‌ చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఈ క్రూరమైన వ్యక్తి నన్ను చాలా బాధపెడుతున్నాడు. కొన్నిసార్లు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా. దయచేసి విద్యార్థినులను రక్షించండి. అవమానం కారణంగా ఏ విద్యార్థిని బహిరంగంగా ఫిర్యాదు చేయలేదు. కాబట్టి, దయచేసి ఈ రాక్షసుడిపై కఠిన చర్యలు తీసుకోండి. నాలాంటి చాలా మంది అమ్మాయిలకు న్యాయం చేయండి’ అని ఆ లేఖలో వేడుకున్నది.

Also read: Sunita Williams : భూమి మీదకొచ్చాక నడవలేని పరిస్థితిలో సునీతా విలియమ్స్.. చాలా హెల్త్ ప్రాబల్స్

మరోవైపు ఆ ప్రొఫెసర్ గత ఏడాదిన్నరగా విద్యార్థినులపై ఇలాంటి లైంగిక వేధింపులకు (Sexual Assault) పాల్పడుతున్నట్లు బాధిత మహిళ ఆరోపించింది. మహిళా కమిషన్, ఇతర సీనియర్ అధికారులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించింది. ప్రొఫెసర్ అసభ్యకరమైన చర్యలకు పాల్పడుతున్న ఫొటోలు, వీడియో క్లిప్స్‌ను పోలీసులకు పంపింది. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆ మహిళ ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ప్రొఫెసర్ రజనీష్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడి దారుణాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  కుంభమేళాలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు? హైకోర్టు సంచలన తీర్పు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు