/rtv/media/media_files/2025/01/13/c1LyUZqQj2llO6Ma1E9t.jpg)
Md sajjanar shared important video shared on matrimony
Matrimony: ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చిన ఆన్‌లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ అడ్డగోలుగా దోచేస్తున్న దుండగులు తాజాగా వివాహ వేదికలపై కన్నేశారు. పెళ్లి సంబంధాల పేరిట యువతీయువకులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కాదంటే న్యూడ్ వీడియోలు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటన మ్యాట్రిమోనిలో వెలుగులోకి రాగా.. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 13, 2025
మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.
పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియో కాల్స్.
న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్.. అడిగిన డబ్బు ఇవ్వాలని బెదిరింపులు.
మ్యాట్రిమోని… pic.twitter.com/wS48rAVmTp
న్యూడ్ వీడియో కాల్స్..
ఈ మేరకు మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నట్లు ఓ అమ్మాయి వివరించిన వీడియోను షేర్ చేశారు సజ్జనార్. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు. అడిగినంతా డబ్బు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
ఇది కూడా చదవండి: TG: డమ్మీ చెక్కులిస్తున్న సీఎం రేవంత్.. హరీష్ రావు సంచలన ఆరోపణలు!
మ్యాట్రిమోని సైట్ల కేంద్రంగా ఈమధ్య పెరిగిపోతున్న మోసాలను గమనించాలి. న్యూడ్ వీడియోల వ్యవహారం బయటకి వస్తే పరువు పోతుందనే భయంతో ఫిర్యాదుకు జంకుతున్న బాధితులు.. ఆత్మ హత్యలకు సైతం పాల్పడుతున్నారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో పరిచయమైన యువతి, యువకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీడియో కాల్స్ చేయమన్నా, న్యూడ్ ఫోటోలు అడిగిన కచ్చితంగా అనుమానించాల్సిందే. మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 నబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండని సూచించారు.